సీరియల్ నటి నవ్య స్వామికి గాయాలు.. షోలో ఊహించని విధంగా ఘటన?

టాలీవుడ్ బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి పరిచయం బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే.తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నవ్య స్వామి తన నటనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

 Serial Actress Navya Swamy Injured Unexpected Incident In The Show, Navya Swamy-TeluguStop.com

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

కన్నడ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన నవ్య స్వామి ఆ తర్వాత తమిళంలో కూడా నటించింది.

ఇక తెలుగు ప్రేక్షకులకు నా పేరు మీనాక్షి సీరియల్ తో పరిచయము కాగా ఈ సీరియల్ తో మంచి అభిమానం సంపాదించుకుంది.అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన ఆమె కథ సీరియల్ లో కూడా నటించింది.

ఈ సీరియల్ అతి తక్కువ సమయంలో ముగింపు పలికింది.ఇటీవలే నా పేరు మీనాక్షి సీరియల్ కూడా శుభం కార్డు పలికిన సంగతి తెలిసిందే.

ఇక ఆమె కథ సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి కృష్ణ తో బాగా సన్నిహితంగా ఉంటుంది.గతంలో వారి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు బాగా గుసగుసలు వినిపించాయి.

Telugu Navya Swamy, Serial Actress, Show, Tollywood-Movie

కానీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు.కానీ ఇప్పటికీ వీరిద్దరూ కలిసి ఈవెంట్లలో, షో లలో పాల్గొని బాగా సందడి చేస్తుంటారు.అంతేకాకుండా చూడటానికి ఎంతో సన్నిహితంగా కనిపిస్తారు కూడా.ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా నవ్య స్వామి సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక పోస్టు తో బాగా సందడి చేస్తుంది.

తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అందులో తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది.

అప్పుడప్పుడు ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని కూడా షేర్ చేసుకుంటుంది.తను చేసిన ప్రతి పోస్ట్ కు రవి కృష్ణ వెంటనే లవ్ సింబల్ తో స్పందిస్తూ ఉంటాడు.

Telugu Navya Swamy, Serial Actress, Show, Tollywood-Movie

వారిద్దరి మధ్య ఎన్ని గాసిప్స్ వచ్చినా కూడా సోషల్ మీడియా వేదికగా తాము కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటారు.ఈమధ్య నవ్య స్వామి బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో కూడా పాల్గొని బాగా ఎంజాయ్ చేస్తుంది.పైగా తన పర్ఫామెన్స్ లతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.

అలా తాజాగా మరో షో లో సందడి చేస్తూ ఉండగా తనకు గాయాలు అయ్యాయి.

ప్రస్తుతం బుల్లితెరపై ‘సూపర్ క్వీన్స్‘ అనే ఎంటర్టైన్మెంట్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.ఇందులో బుల్లితెర సెలబ్రిటీలు పాల్గొని తమ పర్ఫామెన్స్ తో బాగా సందడి చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ షో సెమీ ఫైనల్ కు చేరుకోవడంతో షో నిర్వాహకులు వారికి కొన్ని టాస్క్ లు కూడా ఇచ్చారు.

దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల కాగా.

అందులో కంటెస్టెంట్ లు వారి మోచేతులతో కూల్ డ్రింక్ టిన్స్ ను పగలగొట్టారు.ఆ సమయంలో ఊహించని విధంగా నవ్య స్వామి కి రక్తం కారినట్లుగా కనిపించగా.

ఆ టాస్క్ లో పాల్గొన్న పలువురు సెలబ్రిటీల కు కూడా గాయం అయినట్లు కనిపించింది.ఇక ఇదంతా చూసిన వాళ్ళు ఇది నిజమా లేక ఏదైనా ఫ్రాంక్ ఆ.అని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube