తిరుమల శ్రీవారిని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ, ఎంపీ గురుమూర్తి దర్శించుకున్నారు.ఈ ఉదయం విఐపీ విరామ సమయంలో వీరు ఇరువురు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయగా దర్శనాంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేశారు.







