వైన్ సీసాలో సంవత్సరం క్రింద పాము ను ఉంచారు.అన్ని రోజులు అది సీసాలో ఉంటే బ్రతుకుతుందా? మాములుగా అయితే బ్రతకదు.కానీ ఈ పాము మాత్రం బ్రతికిందట.ఏడాది తర్వాత మూత తీస్తే అది కాటేసింది.దీంతో అందరు షాక్ అయ్యారు.అసలు ఈ పాముల గోల ఏంటి అని అనుకుంటున్నారా.
ఇలాంటి వింతలు గురించి తెలిస్తే వెంటనే మనకు ఆ దేశం ఏంటి.
ఇలాంటి వింత జరిగే దేశం మరొకటి లేదు.
అది చైనా దేశం మాత్రమే.ఇలా వారు వాడే జీవుల వల్ల వైద్యులకు కూడా అంతు పట్టని వైరస్ లు వ్యాపిస్తున్నాయి.
ఇంత జరిగినా ప్రపంచం మొత్తం చైనా ని వేలెత్తి చూపిస్తున్నా చైనీయులలో మార్పు అనేది రావడం లేదు.మొన్నటి వరకు కరోనా తో ఎంతగా పోరాడామో అందరికి తెలుసు.
అయినా కూడా వీరు ఇలానే చేస్తున్నారు.
వీరు వైద్యంలో కూడా వింత వింత పద్ధతులను ఆచరిస్తారు.
తాజాగా వీరు ఉపయోగించిన వైద్యం కారణంగా మరొక ఘటన జరిగింది.స్నేక్ వైన్ ను అక్కడి ప్రజలు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
చైనాకు చెందిన ఒక వ్యక్తి స్నేక్ ఆయిల్ బాటిల్ మూత ను ఓపెన్ చెయ్యగా అందులో ఉన్న పాము అతడిని కాటేసింది.ఈ బాటిల్ ను ఆయన ఒక వైద్యం కోసం కొన్నాడు.

అలా కొన్న తర్వాత బాటిల్ మూత తీయగా అతడిని పాము ఒక్కసారిగా కాటేసింది.దీంతో అతడు షాక్ అయ్యాడు.ఏడాది పాటు అలా వైన్ బాటిల్ లో ఉన్న పాము ఇలా కాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.ఇలా అక్కడి ప్రజలు స్నేక్ వైన్ ను కొన్ని రకాల వ్యాధులను నివారించడానికి వాడుతూ ఉంటారు.
ఈ విషయంపై నిపుణులు చెబుతుంది ఏంటంటే.గాలి లోపలికి వెళ్ళేలాగా జార్ మూత తెరిచి పెడితే ఆల్కహాల్ లో పాములు బతికే ఉంటాయని చెబుతున్నారు.
మరి వీరు పద్ధతులు మిగతా దేశాల ప్రజలకు పిచ్చి ఎక్కిస్తున్నాయి.