'సలార్' మూవీ ఎప్పుడు రాబోతుంది.. మేకర్స్ ఏం చెప్పారంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.అందులో ‘సలార్’ సినిమా ఒకటి.

 Salaar To Be A 2023 Release Producer Vijay Kiragandur Talks About The Shoot Sche-TeluguStop.com

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రెసెంట్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.

ఈ సినిమా సంక్రాంతి 2022 లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు.కానీ ఈ సంక్రాంతి పోయింది.ఇక ఇప్పుడు 2023 లో అయినా రిలీజ్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.తాజాగా ఈ సినిమా విడుదల విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా నిర్మాత తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో సలార్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

”సలార్ సినిమా 30 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది.మిగిలిన షూటింగ్ మే నెలలో స్టార్ట్ అవుతుంది.

Telugu Jagapati Babu, Prabhas, Prashanth Neel, Salaar, Shruti Haasan-Movie

ఈ ఏడాది చివరి లోపు ఈ సినిమాను పూర్తి చేస్తాం.ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమా 2023 ఏప్రిల్ లో కానీ, జూన్ లో కానీ రిలీజ్ చేస్తాం అంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు” దీంతో ఈ సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది.

Telugu Jagapati Babu, Prabhas, Prashanth Neel, Salaar, Shruti Haasan-Movie

ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ కాదు అని తెలిసిన ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.రిలీజ్ డేట్ వచ్చే ఏడాదికి కన్ఫర్మ్ చేయడంతో అప్పటి కోసం ఎదురు చూస్తున్నారు.గత ఏడాది మొదలు పెట్టిన ఈ షూటింగ్ ఇప్పటికి ఇంకా 30 శాతం మాత్రమే పూర్తీ అవ్వడంతో నీల్ ఈ సినిమాను బాగా చెక్కుతున్నాడు అని అర్ధం అవుతుంది.

ఈ సినిమా నుండి వచ్చిన లుక్ చూసి ప్రభాస్ మాస్ అవతారములో దర్శనం ఇవ్వనున్నాడు అని ఇప్పటికే తెలిసిందే.దీంతో ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube