గిరిజన రిజర్వేషన్ లను పెంచాలని గవర్నర్ తమిళ సై కి వినతి పత్రం సమర్పించిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులు..

రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ లను పెంచాలని అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయంలో చొరవ తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం గవర్నర్ తమిళ సై కి విన్నవించారు.

శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి, వినతి పత్రం సమర్పించారు.

అనంతరం గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు వెంకట్ బంజారా మాట్లాడుతూ 2017 లో రాష్ట్ర ప్రభుత్వం చేళ్ళప్ప కమిషన్ సిఫార్సులను అనుసరించి రాష్ట్రం లో ఉన్న గిరిజనుల రిజర్వేషన్ లు వారి జనాభా దామాషా ప్రకారం పెంచాలని ఒక అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపించారని గుర్తు చేశారు.కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో తమకు గిరిజన రిజర్వేషన్ పెంపుకు సంబందించి ఎటువంటి తీర్మానం అందలేదని పేర్కొన్నారన్నారు.

దీంతో అమాయక గిరిజన యువత, విద్యార్థులు తీవ్ర గందర గోళం లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనుల తరపున రాష్ట్ర గవర్నర్ చొరవ తీసుకుని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా కృషి చేయ్యాలని విన్నవించామన్నారు.

గవర్నర్ తమిళ సై తమ అవేదన ను అర్థం చేసుకున్నారని, ఈ విషయములో గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.త్వరలో ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో గిరిజన రిజర్వేషన్ లు పెంచక పోతే తమ వర్గాల యువత నష్ట పోతారని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చెయ్యలన్నారు.

Advertisement

లేని పక్షంలో పది వేల మంది తో ప్రగతి భవన్ ముట్టడించడం తో పాటు, న్యాయం పోరాటానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సేవలాల్ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రాథోడ్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు రవీందర్ నాయక్, లోకేష్, రాజేష్ నాయక్ లు పాల్గొన్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు