ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది.యుద్ధం ప్రకటించి దాదాపు నెలరోజులు కావొస్తున్నా దీనికి ముగింపు దొరకడం లేదు.
అటు పుతిన్‌ను నిలువరించేందుకు అంతర్జాతీయ సమాజం కఠిన ఆంక్షలు విధిస్తోంది.అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు.
అంతేకాదు దాడుల తీవ్రతను మరింత పెంచుతూ.తాడో పేడో తేల్చుకోవాలని చూస్తోంది.
యుద్ధ ప్రభావం ఇప్పటికే ప్రపంచంపై పడింది.చమురు సంక్షోభంతో పాటు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.
రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్ర స్థాయికి చేరే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు.తాజాగా ఈ వ్యవహారం యూకే ఆర్ధిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునక్‌కు లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టింది.
అసలు ఏం జరిగిందంటే.రిషి సునక్ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, ఆయన కుమార్తె అక్షతా మూర్తిని రిషి పెళ్లాడిన సంగతి తెలిసిందే.ఇన్ఫోసిస్ ఎప్పడి నుంచో రష్యాలోనూ తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది.యుద్ధం నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన వార్తా సంస్థ రిషి సునక్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.
అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలను విధించిన నేపథ్యంలో రష్యాలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలపై సునక్‌ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది.యూకే ఆర్థిక మంత్రి కుటుంబ సభ్యులు రష్యాతో వ్యాపారాలు చేయడం ఎంత వరకూ సబబు అంటూ సదరు సంస్ద నిలదీసింది.
దీనికి రిషి సునక్ కౌంటరిచ్చారు.‘తాను ఇక్కడికి ఎన్నికైన ప్రజాప్రతినిధిగా వచ్చానని.తాను దేనికి బాధ్యత వహిస్తానో దాని గురించి చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.ఇన్ఫోసిస్‌కు చెందిన వ్యవహారం పూర్తిగా కుటుంబ సభ్యులే చూసుకుంటారని రిషి సునక్ తెలిపారు.
కంపెనీ వ్యవహారాలతో తనకేలాంటి సంబంధాలు లేవన్న ఆయన… ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న చర్యలను ఖండించారు.అటు రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సైతం స్పందించింది.
తాము శాంతికి మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది.

ఇకపోతే.సజిద్ జావిద్ తన పదవికి రాజీనామా చేయడంతో రిషి సునక్ .2020 ఫిబ్రవరిలో బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా నియమితులయ్యారు.39 ఏళ్ల రిషి తండ్రి పేరు మోసిన డాక్టర్.బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో ఉన్న సౌతాంప్టన్‌లో రిషి జన్మించారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ చదువుకున్నారు.ఆ తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
ఆ యూనివర్శిటిలో పరిచయమైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తిని 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ల్లో పనిచేసిన రిషి సునక్.గోల్డ్‌మ్యాన్ శాచ్ కంపెనీలో అనలిస్ట్‌గా సేవలు అందించారు.నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాటమారన్‌లో రిషి సునక్ డైరెక్టర్.2014లో రాజకీయాల్లోకి వచ్చిన రిషి.2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మాండ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
.






