తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.అయితే యాసంగి వరి ధాన్యం విషయంలో తగ్గేదేలే అన్న రీతిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎవరి పట్టు వారు వీడడం లేదు.
దీంతో ధాన్యం కొనుగోళ్ళ విషయంలో రైతులలో అనిశ్చితి నెలకొంది.అయితే తెలంగాణలో పండిన పూర్తి ధాన్యాన్ని ఎట్టి పరిస్థితులలో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని రైతు వ్యతిరేక వైఖరిని పూర్తిగా విడనాడాలని టీఆర్ఎస్ పూర్తిగా మొండి పట్టు వీడడం లేదు.దీంతో ఇటు రాష్ట్ర బీజేపీ నేతలకు, టీఆర్ఎస్ నేతలకు మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.
అయితే కేంద్ర మంత్రి మాత్రం అన్ని రాష్ట్రాలకు ఉన్న విధానాన్నే తెలంగాణలోనూ అమలు చేస్తున్నామని, తెలంగాణకు ప్రత్యేకంగా ఒక విధానమంటూ లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికైతే ఈ రగడపై కెసీఆర్ అంతగా స్పందించకున్నా రానున్న రోజుల్లో ఎలాగూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన పరిస్థితుల్లో ఇంకా రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం రణరంగంగా మారే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
అయితే ఇటు రాజకీయ యుద్దం ముగిసినా రైతులలో అసలు ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా అనే సరికొత్త ప్రశ్న ఉత్పన్నమైన పరిస్థితి ఉంది.ఇక కేంద్రం, రాష్ట్రం ఎవరూ పట్టువిడవకపోతుండటంతో అసలు ధాన్యం కొనుగోలు చేస్తారా చేయారా అనే దాని నుండి ప్రభుత్వం నుండి క్లారిటీ రావడం లేదు.
ఏది ఏమైనా వరి ధాన్యం రగడ ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందనేది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ.మరి కేంద్రం, రాష్ట్రంలో ఎవరు మెట్టు దిగుతారనేది చూడాల్సి ఉంది.







