నల్గొండ లోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలురెండో సారి శాసన మండలి చైర్మన్ గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు ధాన్యం కొనుగోలుపై రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు కేంద్రం మానుకోవాలి యాసంగి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం మార్గం చూపించాలి దేశంలో ఉన్న రైతులందరినీ కాపాడాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉంది రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష పూరిత విధానాన్ని మార్చుకుని, పంజాబ్ లో మాదిరిగానే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలి.
పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రములో వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి పంజాబ్ రాష్ట్రానికి ఒక న్యాయం తెలంగాణ రాష్ట్రానికి ఒక న్యాయమా?కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పిన సమాధానం బాధ్యతారాహిత్యంగా ఉంది పీయూష్ గోయల్ చార్టెడ్ అకౌంటెంట్ ,ఆయనకి రైతుల బాధలు ఎలా తెలుస్తాయి నేను స్వయంగా రైతును కాబట్టి రైతుల ఆవేదనను వ్యక్తం చేస్తున్నాను రైతులను ఏడిపిస్తే కేంద్ర ప్రభుత్వానికి పుట్టగత్తలు ఉండవు కేంద్రప్రభుత్వం తన ధోరణి మార్చుకొని తెలంగాణ లోని వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.







