- కన్నుతెరిస్తే జననం.కన్నుమూస్తే మరణం.
కానీ., అవి రెండూ మన చేతిలో వుండవు.
పుట్టుక నుంచి నుంచి చావు వరకు ఎన్ని ఒడిదుడుకులు.సరదాలు, సంతోషాలు కష్టాలు అన్ని భరిస్తాము.
మన శరీరానికి ఏదైనా చిన్న గాయం అయితే ఎంతో అల్లాడిపోతాము.అనుకోకుండా మనకు ఏదైనా చిన్న ప్రమాదం జరిగిన లేదా మన దగ్గర వాళ్లకు ఏదైనా అపాయం జరిగినా ఒక్క క్షణం గుండె ఆగినంత పని అవుతుంది.
క్షేమ సమాచారం తెలియగానే హమ్మయ్య అదృష్టం బాగుందని ఊపిరి పీలుచుకుంటాము.మనకళ్ల ఎదురుగా ఏదైనా సంఘటన జరిగితే అస్సలు మర్చిపోలేము మనకు తెలిసిన వాళ్లకి చెబుతాము.
చుట్టుపక్కల వాళ్లకు ఆ సంఘటనను చెప్పి జాగ్రత్తలు చెబుతాము.మరి స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రతి విషయం క్లిక్ మనిపిస్తూ వుంటారు.
ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అలా సోషల్ మీడియా వేదికలో పంచుకుంటాను.అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కరు కొడుతోంది.
వివరాల్లోకి వెళితే… కేరళలోని కన్నూర్ లో ఓ పిల్లాడు సైకిల్ తొక్కుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు.అదేసమయంలో రోడ్డుపై వేగంగా వస్తున్న స్కూటర్ కి తగలడంతో బాలుడు రోడ్డుకు అవతల వైపు పడ్డగా సైకిల్ మాత్రం రోడ్డు పై పడింది.
అదృష్టవశాత్తూ పిల్లవాడికి ఎలాంటి గాయాలు తగలకుండా క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు.ఆ సమయంలో వెనకాలే బస్సు రావడంతో సైకిల్ నుజ్జునుజ్జు అయింది.
రోడ్డు పక్కన వున్న వారందరూ బాలుడి వద్దకు పరుగులు తీశారు.అతను క్షేమంగా వుండటంతో అందరూ ఊపిరి పీల్చు కున్నారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.దాంతో ఆ బాలుడు అదృష్టవంతుడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.







