రానున్న రోజులన్నీ కాంగ్రెస్ కు అగ్ని పరీక్షయేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.అయితే టీఆర్ఎస్ టార్గెట్ గానే అన్ని పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సైతం అదే బాటలో నడుస్తూ గతంలో కంటే మెరుగైన ఫలితాలు రాబట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

 Will The Coming Days Be A Litmus Test For Congress , Telangana Politics , Revant-TeluguStop.com

అయితే ముందస్తు ఎన్నికలపై ఎట్టకేలకు కెసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో ఇక ముందస్తు ఎన్నికల ప్రచారానికి తెర పడిందని చెప్పవచ్చు.అయితే ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు ఉన్నా ఇప్పటి నుండే ఎన్నికలకు ప్రతి ఒక్క పార్టీ తెర వెనుక సన్నద్దమవుతున్న పరిస్థితి ఉంది.

అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం రానున్న రోజులన్నీ అగ్ని పరీక్షలా మారే అవకాశాలు ఉన్నాయి.ఎందుకంటే ఇప్పటికే తాజాగా జరిగిన అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే.

అయితే తెలంగాణలో కూడా సత్తా చాటకపోతే ఇక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందనే విమర్శలు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల నుండి వచ్చే అవకాశం ఉంది.అయితే రేవంత్ రెడ్డి మాత్రం గతంలో కంటే మెరుగైన ఫలితాలు వచ్చేలా ప్రణాళికలు రచిస్తూనే ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాలలో బలహీన పడ్డామో ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఎంత వరకు ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ బలపడుతుందనే విషయాన్ని ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేక పోయినా రానున్న రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి మనకు కాస్త క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.అయితే కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత విభేదాలు కొంత సమసిపోతేనే ఎంతో కొంత కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది.

మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎలా సత్తా చాటుతుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube