ఏపీలో మూడు రాజధానుల ముచ్చట కొనసాగుతూనే ఉంది.రాజధాని విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత జగన్‌కు ఉన్న మార్గం సుప్రింకోర్టును ఆశ్రయించడం.
కొంతకాలంగా ఇదే విషయమై సతమతమైన జగన్ క్లారిటి ఇచ్చాడు.రాజధాని అంశం ప్రజా కోర్టులోనే తేల్చుకోవలని భావిస్తున్నారు.
అంటే ఎన్నికల వరకూ వేచి ఉండడం.ఇందుకు దాదపు రెండేండ్ల సమయం ఉంది.
అప్పటి వరకు మూడు రాజధానుల అంశంపై తమ స్టాండ్ మారలేదని చెబుతు రావాలి.అయితే ఈ వివాదం గత రెండేండ్లుగా సాగుతోంది.
మూడు రాజధానులు ఉండాలా ? అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలా అనే విషయపై జనాభిప్రాయం తెలయకపోయినా రాజకీయ పార్టీల మధ్య మాత్రం చిచ్చు రాజుకుంటూనే ఉంటోంది.
అయితే హైకోర్టు మూడు రాజధానులు కాదు.
ఒక్కటే రాజధాని అని క్లారిటీ ఇచ్చినా వైసీపీ మాత్రం మూడు రాజధానులే ముద్దంటోంది.ఇదే విషయమై జగన్ కూడా అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ కూడా ఇచ్చేశారు.
అదేంటంటే వికేంద్రీకరణ తమ విధానమని తేల్చి చెప్పారు.అ విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు తలెత్తినా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధి, అందరి గౌరవం అన్నదే తమ విధానమంటూ చెప్పుకొచ్చారు.మొత్తంగా వికేంద్రీకరణ బాటలో సాగడం తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు.
అమరావతి రైతులు భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడుతామని చప్పారు.అదే క్రమంలో ఒక్కచోటే రూ.10.9లక్షల కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన రాష్ట్ర పరిస్థితి ఏంఈ ? అని జగన్ ప్రశ్నించారు.
మొత్తంగా అమరావతిని చంద్రబాబు బ్లూ ప్రింట్ మేరకు అభివృద్ధి చేయమని జగన్ స్పష్టం చేసినట్టు అర్థం చేసుకోవచ్చు.ఏపీలోని ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసినట్టే అమరావతిని అభివృద్ధి చేస్తామని క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
కాగా మూడు రాజధానుల విషయంలో తాము తగ్గేదే .లే అన్నట్టు వైసీపీ వ్యవహరిస్తోంది.మరి జగన్ మూడు ముచ్చట తీరుతుందా ? లేదా ? అన్నది వేచి చూడాలి.
.