ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈమధ్య బాగా క్రేజ్ తెచ్చుకున్న ఓటీటీల మీద స్పందించాడు.ముఖ్యంగా ఓటీటీ ఆడియెన్స్ మీద తారక్ తన ఒపీనియన్ పంచుకున్నారు.
ఓటీటీ ఆడియెన్స్ ని లేజీ అంటే తాను ఒప్పుకోనని.ఓటీటీ కంటెంట్ చూడటానికి ఆడియెన్స్ లేజీగా ఉండరని.
ఓటీటీ కూడా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో ఒక భాగమని అన్నారు.ఆడియెన్స్ ని థియేటర్ కి రప్పించేలా మనం చేయాలని అన్నారు తారక్.
అయితే ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాలు థియేటర్ లోనే చూసి ఎంజాయ్ చేయాలని.బాహుబలి లాంటి సినిమా చూడాలంటే థియేటర్ లోనే బాగుంటుందని అన్నారు.
అయితే ఓటీటీల వల్ల సినిమా పరిశ్రమకు ఎలాంటి దెబ్బ లేదని అన్నారు ఎన్.టి.ఆర్.మొత్తానికి ఎన్.టి.ఆర్ కూడా ఓటీటీ ఆడియెన్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పి అందరిని సర్ ప్రైజ్ చేశారు.ఆర్.ఆర్.ఆర్ సినిమా వరల్డ్ వైడ్ గా శుక్రవారం భారీగా రిలీజ్ అవుతుంది.ఈ సినిమా విషయంలో అభిమానుల అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
సినిమా టాక్ ఏంటన్నది మరికొద్ది గంటల్లో వస్తుంది. ప్రపంచ తెలుగు సిని అభిమానులంతా ఆర్.ఆర్.ఆర్ హంగామా చేయనున్నారు.