ఆ క్రికెటర్‌పై నిషేధం విధించిన ఐసిసి పాలకమండలి..!

దక్షిణాఫ్రికా క్రికెటర్ జుబేర్ హమ్జాకు ఐసీసీ షాక్ ఇచ్చింది.డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అతడిపై కఠిన చర్యలు తీసుకుంది.

 Icc Bans South Africa Cricketer Zubayr Hamza Details, Cricket, Crickter, Suspen-TeluguStop.com

నిషేధిత డ్రగ్స్ ఆనవాళ్లు అతడి శరీరంలో కనిపించడంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది.ఇక డ్రగ్స్ విషయంలో అతడు నేరాన్ని అంగీకరించాడని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది.దీంతో క్రీడాలోకం నివ్వెరబోయింది.

నేరాన్ని అంగీకరించిన జుబేర్

ఇటీవల సౌత్ ఆఫ్రికా క్రికెటర్లకు ఐసీసీ డోపింగ్ టెస్టులు నిర్వహించింది.జనవరి 17, 2022న వారి నుంచి శాంపిళ్లను సేకరించింది.ఇందులో జుబేర్ శాంపిళ్లు పరీక్షించగా నిషేధిత డ్రగ్స్ వాడినట్లు తెలిసింది.దీంతో విచారణ చేపట్టగా జుబేర్ వాస్తవాలను అంగీకరించాడు.దీంతో ఐసీసీ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

తక్షణమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధం విధించినట్లు బుధవారం ప్రకటించింది.ఆరు టెస్టులు, ఒక వన్డే ఆడిన హమ్జా, ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు.

అయితే వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్ నుంచి వైదొలగుతున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు సమాచారమిచ్చాడు.

Telugu Cricket, Crickter, Icc Bans, Afica Cricket, Ups, Zubayr Hamza-Latest News

డోపింగ్‌లో తేలిన డ్రగ్ అదే.

ఐసీసీకి డోపింగ్ టెస్టులో జుబేర్ పూర్తిగా సహకరించాడని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది.డోపింగ్ అని తేలగానే స్వచ్ఛంద సస్పెన్షన్‌కు అతడు అంగీకరించాడని పేర్కొంది.

ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ నిషేధిత జాబితాలో ఉన్న ఫ్యూరోసెమైడ్ అతడి శాంపిళ్లలో కనిపించింది.మూత్రవిసర్జన సమస్యలు, హైబీపీ, శరీరంలో నీరు ఎక్కువగా ఉండడం వంటి వాటికి విరుగుడుగా ఫ్యూరోసెమైడ్ పని చేస్తుంది.

అయితే దీనిని ఆటగాళ్ల పనితీరును మెరుగుపరిచే డ్రగ్ కాదని క్రికెట్ సౌతాఫ్రికా తెలిపింది.అనారోగ్యం కారణంగా అతడు ఆ డ్రగ్ వాడాడని, అయితే నిషేధిత జాబితాలో ఆ డ్రగ్ ఉండడంతో ఐసీసీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube