క్రాస్‌ రోడ్స్‌ లో భీమ్లా అరుదైన రికార్డ్ ని బద్దలు కొట్టబోతున్న 'ఆర్ఆర్ఆర్‌'

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్‌ సూపర్ డూపర్ సక్సెస్‌ ను దక్కించుకుంది.రెండు వందల కోట్ల వసూళ్లను దక్కించుకున్న భీమ్లా నాయక్ సినిమా అరుదైన రికార్డులను నమోదు చేసింది.

 Pawan Kalyan Bheemla Nayak Record Beak By Rrr Movie, Bheemla Nayak, Flim News, M-TeluguStop.com

ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లను దక్కించుకున్న టాప్ చిత్రాల జాబితాలో నిలవడంతో పాటు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమా గా కూడా భీమ్లా నాయక్‌ కుమ్మేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అద్బుతమైన వసూళ్లతో భీమ్లా నాయక్ ఈ ఏడాది మేటి చిత్రంగా ఉంది.

ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమా ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమా గా నిలిచింది.ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్ లో భీమ్లా నాయక్‌ 1.25 కోట్ల వసూళ్లను రాబట్టి టాప్ గా నిలిచింది.

Telugu Bheemla Nayak-Movie

రేపు విడుదల కాబోతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కేవలం మొదటి వీకెండ్‌ లోనే ఆ మొత్తం ను రాబట్టడంతో పాటు లాంగ్‌ రన్ లో ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ఆర్ టీ సీ క్రాస్‌ రోడ్స్ లో ఏకంగా అయిదు కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమా గా ఆర్ ఆర్ ఆర్‌ నిలుస్తుంది.ఈ ఏడాదిలో మరో ఎనిమిది నెలలు ఉన్నా కూడా ఆ స్థాయి సినిమా లు రాకపోవచ్చు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.

అందుకే భీమ్లా నాయక్‌ రెండవ స్థానంలో కొనసాగేనా అనేది చూడాలి.ఈ ఏడాది లో ఇప్పటి వరకు వందల కొద్ది సినిమాలు విడుదల అయ్యాయి.కాని రెండు మూడు సినిమాలు తప్ప పెద్దగా సక్సెస్‌ అవ్వలేదు.అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube