దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా విడుదల కావడానికి మరి కొద్ది గంటల సమయం ఉండటంతో చిత్ర బృంధం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.ఈ క్రమంలోనే రాజమౌళి తాజాగా సందీప్ రెడ్డి వంగా తో కలిసి ముచ్చట్లు పెట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.క్రౌడ్ తో చేసిన సన్నివేశాలు గ్రాఫిక్స్ నా లేక నిజంగానే అంత మందిని పెట్టారా అని సందీప్ రెడ్డి వంగా ప్రశ్నించగా.
ఆ విషయం పై రాజమౌళి స్పందిస్తూ.సినిమాలో సన్నివేశాలను బట్టి జనాలను పెంచుకుంటూ వెళ్లాను అని తెలిపాడు.
అలా దాదాపుగా మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులను సన్నివేశాల్లో వాడాము అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.ఇక అప్పుడు సందీప్ రెడ్డి జూనియర్ ఆర్టిస్టులను కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా అని ప్రశ్నించగా ఈ విషయంపై రాజమౌళి స్పందిస్తూ కొందరు తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటారు.
కొందరు దుస్తులు కుట్టు కుంటూ ఉంటారు షాట్ రెడీ అనగానే డబ్బులు సామాన్లు అన్నీ పెట్టేసుకొని వస్తారు అని తెలిపాడు.

అప్పుడు సందీప్ రెడ్డి మాట్లాడుతూ.వాళ్లు అలాగే ఉండాలి వారి పనులు వారు చేసుకుంటూ వెళుతూ ఉండాలి.ఇంతకూ డైరెక్టర్లు కూడా వారికి చెబుతూ ఉండాలి అని అనగా, అప్పుడు రాజమౌళి మన వాళ్ళు అని చెప్పరు అని అంటాడు.
అదే ఒకవేళ మలయాళ సినిమాల్లో అయితే ప్రతి ఒక్క జూనియర్ ఆర్టిస్ట్ పర్ఫెక్ట్ గా కనిపిస్తారు.పర్ఫెక్ట్ గా చేస్తారు.కొన్ని కొన్ని సార్లు అలా మనం ఎందుకు చేయలేమా? అని సిగ్గేస్తోంది అని అన్నారు రాజమౌళి.ఇక ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో కొన్ని డాక్యుమెంటరీ లను టీమ్ కు చూపించాను.
అందులో బ్యాక్ గ్రౌండ్ లో ఎవరెవరు ఏం చేస్తున్నారు?వాళ్ళు ఎలాంటి దుస్తులు ధరించారు? ఇలా ప్రతి ఒక్కటి నోట్ చేసుకోమని టీమ్ కి చెప్పాను అని తెలిపారు రాజమౌళి.అంతే కాకుండా లావుగా ఉండే జూనియర్ ఆర్టిస్టులను తీసుకోవద్దని చెప్పాను.
ఇక బిజీ రోడ్లలో కొందరు అక్కడ పులి మేక ఆడుకుంటూ కనిపించారు.ఈ సినిమా చూస్తే తప్పకుండా ఆ కాలానికి వెళ్లినట్లు అనిపిస్తుంది అని రాజమౌళి తెలిపారు.
సెట్ వర్క్, జూనియర్ ఆర్టిస్టులకు వాడిన క్యాస్టూమ్స్ కూడా అప్పటి కాలానికే చెందినట్టుంటాయి.







