అనంతపురం జిల్లా జాకీ పరిశ్రమ తరలి పోవడానికి కారణం రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డే కారణమని మాజీ మంత్రి పరిటాల సునీత, యువనేత పరిటాల శ్రీరామ్ లు పేరొన్నారు.పరిశ్రమ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురిచేసి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లే విధంగా చేసి యువతకు మహిళలకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసినందుకు నిరసనగా నేడు మాజీ మంత్రి పరిటాల సునీత, టిడిపి ధర్మవరం ఇన్చార్జి టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ లు జాకీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన స్థలం దగ్గర్నుంచి యువతతో కలిసి పాదయాత్ర చేపట్టారు పాదయాత్రలో యువతతో పాటు టిడిపి శ్రేణులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ పాదయాత్ర రాప్తాడు లోని తాసిల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు.
టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన జాకీ పరిశ్రమను తరిమేసింది ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డేనని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తంచేశారు.
జాకీ కంపెనీ ప్రతినిధు లను 15కోట్లతో పాటు వర్కులు కావాలని బెదిరించింది నిజం కాదా అని ప్రశ్నించారు.నీ గుండెల చేయి వేసుకుని ఇదంతా అబద్దం అని చెప్పగలవా అని నిలదీశారు.
జాకీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ పాదయాత్ర చేపట్టారు.జాకీ పరిశ్రమ ఏర్పాటు స్థలం నుంచి రాప్తాడు తహసిల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగింది.
ఈ కార్యక్రమంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన తరువాత సునీత మాట్లాడుతూ మా కృషి వలన 2018లో జాకీ పరిశ్రమ రాప్తాడుకు వచ్చిందని.
అప్పట్లో కాంపోండ్ వాల్ తో పాటు సామాగ్రి కూడా తెచ్చారన్నారు.అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఎమ్మెల్యే, అతని సోదరులు కంపెనీ ప్రతినిధులను బెదిరించడంతో వారు ఇతర ప్రాంతాలకు వెళ్లారన్నారు.

అక్కడ 25ఎకరాల భూమి కాజేయాలని కూడా చూశారన్నారు.ఈ పరిశ్రమ వచ్చి ఉంటే ప్రత్యక్షంగా 6వేల మందికి ఉపాధి ఉండేదన్నారు.రాప్తాడు ప్రజలకు తీరని అన్యాయం చేశారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే మీరు బెదిరింపుల వలన పరిశ్రమ పోతే మా పై నిందలు మోపుతారా అంటూ సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిద్రలో కూడా పరిటాల పేరు ఉచ్చరించకుండా ఉండలేరా అని ప్రశ్నించారు.మీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది.పరిటాల వారిని విమర్శించడానికి కాదని.వీలైతే ప్రజలకు మంచి చేయాలని సూచించారు.
డ్వాక్రా మహిళల నుంచి 10కోట్ల రూపాయలు వసూళ్లు చేసి ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ చేశారని ఆరోపించారు.ఆతరువాత మేము నిలదీస్తే అప్పుడు హడావుడిగా భూమి పూజ చేశారన్నారని పరిటాల సునీత పేర్కొన్నారు.







