టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి.
రాజమౌళి తో పాటు ఇద్దరు హీరోలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.ఇక ఈ సినిమా థియేటర్ల వద్ద అభిమానుల సందడి వాతావరణం నెలకొంది.
గత రెండు మూడు రోజులుగా అభిమానులు థియేటర్ల వద్ద భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ కటౌట్లను నిర్మిస్తున్నారు.అందుకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలను సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం.
ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ లకు సంబంధించిన యాజమాన్యాలు ప్రస్తుతం జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇద్దరు హీరోల అభిమానులు కలిసి ఎంతటి రచ్చ చేస్తారో అంటూ వారు భయపడుతున్నారు.
సినిమాను ఎంజాయ్ చేస్తే పర్వాలేదు.కానీ ఆ సినిమా ప్రసారం అవుతున్న సమయంలో థియేటర్లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులు గొడవపడితే పరిస్థితి ఏంటి అనేది కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందుకే ముందు జాగ్రత్తగా థియేటర్ల వద్ద పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలని థియేటర్ యాజమాన్యం భావిస్తున్నారు.అభిమాన సంఘాల నాయకులు మరియు థియేటర్ల యాజమాన్యాలు ఇప్పటికే చర్చించినట్లుగా తెలుస్తోంది.

సినిమా స్క్రీనింగ్ సమయంలో ఎలాంటి గొడవలు సృష్టించవద్దు అంటూ థియేటర్ల యాజమాన్యాలు అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఒకవేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడ్డ కూడా కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని.పోలీసులకు ఫిర్యాదు చేయడం తో పాటు నష్టపరిహారం భారీగానే వసూలు చేస్తామని థియేటర్ల యాజమాన్యాలు ముందుగానే హెచ్చరిస్తూ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోల అభిమానులు ఏం చేస్తారు అనేది చూడాలి.







