విజయవాడ ఏపీ ఎక్సైజ్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు.కల్తీ సారా ఘటనపై విచారణ జరపాలని, నకిలీ బ్రాండ్లను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు.
వారిని పోలీసులు అడ్డుకున్నారు.అయితే కనీసం ఐదుగురినైనా లోపలకు అనుమతించాలని, కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చి వస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు కోరినా పోలీసులు వినలేదు.
తామేమి నేరం చేయడానికి రాలేదని ఎందుకు అడ్డుకుంటున్నారని నేతలు పోలీసులను ప్రశ్నించారు.అయినా పోలీసులు పట్టించుకోలేదు.
చివరికి టీడీపీ నేతలను అరెస్టు చేసి వేరే బస్సులో తరలించారు.
ఉంగుటూరు పోలీసు స్టేషన్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు.
కాసేపట్లో టీడీపీ ఎమ్మెల్యే ల దగ్గరకు రానున్న నారా లోకేష్ .అరెస్టయిన ఎమ్మెల్యేలు ఉంగుటూరు, కార్యకర్తలు కంకిపాడు స్టేషన్ లకు తరలించిన పోలీసులు
.