యాదాద్రి జిల్లా:వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా సమస్యలపై ప్రజలను కలుస్తూ ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర సాగిస్తున్నారు.ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో యాత్రను కొనసాగిస్తున్నారు.
అయితే,వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రపై బుధవారం తేనెటీగలు దాడి చేశాయి.మోటకొండూరు మండలం నుండి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో దుర్శగానిపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో మాట్లాడారు షర్మిల.
ఇదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.తన సహాయక సిబ్బంది అప్రమత్తం కావడంతో తేనెటీగల దాడి నుండి వైఎస్ షర్మిల బయటపడ్డారు.