హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, రాష్ట్ర పోలీసులపై అసభ్యకరమైన వ్యాఖ్యలతో పాటు బెదిరింపులకు పాల్పడిన అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ ఎట్టకేలకు దిగొచ్చాడు.తాను చేసిన వ్యాఖ్యల పట్ల తనను క్షమించాలని అతను కోరాడు.
నిందితుడిని నారార్ గ్రామానికి చెందిన సందీప్ అలియాస్ మిపా బంగ్రూగా గుర్తించారు.సీఎం, పోలీస్ శాఖపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను సందీప్, అతని కుటుంబంపై దేశ ద్రోహం సహా ఐటీ చట్టం కింద పలు అభియోగాలు మోపారు.
దీంతో దెబ్బకు దిగొచ్చిన సందీప్.ఓ వీడియో సందేశం ద్వారా ముఖ్యమంత్రికి, పోలీసులకు క్షమాపణలు చెప్పారు.మద్యం మత్తులోనే ఆ వ్యాఖ్యలు చేశానని.కావాలని కాదని వివరణ ఇచ్చుకున్నాడు.
ఈ తప్పులో తన కుటుంబం ప్రమేయం వుందని తేలితే ఉరి తీయాలని .కావాలంటే వారి ఫోన్ కాల్స్‌ను కూడా తనిఖీ చేయవచ్చని సందీప్ చెప్పాడు.తన కుటుంబ సభ్యుల ప్రమేయం లేకపోయినా వారిని పోలీసులు అరెస్ట్ చేశారని అతను ఆరోపిస్తున్నాడు.
ఈ సందర్భంగా ఎస్పీ మక్సూద్ అహ్మద్ మాట్లాడుతూ.
తాము ఎవరి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోలేదన్నారు.సందీప్, అతని నలుగురు కుటుంబ సభ్యులపైనా ఐపీసీ, ఐటీ చట్టంలోని 124A, 294, 506, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అంతకుమించి ఎవరిని అరెస్ట్ చేయలేదని మక్సూద్ అహ్మద్ పేర్కొన్నారు.అంతకుముందు సందీప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో .సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇందులో అతను పోలీసులు, సీఎంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు.
మరోవైపు.బలవంతపు మతమార్పిడులపై హర్యానా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో “హర్యానా ప్రీవెన్షన్ ఆఫ్ అన్లాపుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ బిల్లు, 2022′ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది.