'ముద్రగడ ' ఆవేదనను వారు పట్టించుకుంటారా ?

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు.రాజకీయంగా చక్రం తిప్పేందుకు ఆయనకు అవకాశం వచ్చినా ఆయన మాత్రం అటు కాపు ఉద్యమంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ యాక్టిివ్ గా ఉండేందుకు ఇష్టపడటం లేదు.

 Mudragada Padmanabhan Is Trying To Keep The Kapu Community Leaders From Going To-TeluguStop.com

అయితే కొద్ది రోజుల క్రితం బి సి, ఎస్ సి సామాజిక వర్గం లోని కొంతమంది నేతలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు.మూడో ప్రత్యామ్నాయ కూటమిని ఏపీలో ఏర్పాటు చేయబోతున్నట్లు గా సంకేతాలను అందించారు.

ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లిందో .ముందు ముందు ఏం చేయబోతున్నారు అనేది సరైన క్లారిటీ లేదు గాని, వైసీపీకి అనుకూలంగానే ఆయన వ్యవహారాలు చేస్తున్నారు అనే అనుమానాలు మాత్రం రాజకీయ వర్గాల్లోనూ,  కాపు సామాజికవర్గంలోనూ మొదలైంది.ఇక వైసీపీ ప్రభుత్వం పై కాస్తో కూస్తో ఉన్న వ్యతిరేకత కారణంగా జనసేన టిడిపి వైపు కాపు సామాజిక వర్గం చూస్తుండడంతో తన బద్ధ రాజకీయ శత్రువైన టిడిపి అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు ఏమో అన్న భయము ముద్రగడ ను వెంటాడుతోంది.

అందుకే ఇటీవల కాపు సామాజిక వర్గం లోని కొంతమంది కీలక నాయకులకు ఆయన హితబోధ చేశారట.

తాత్కాలిక ప్రయోజనాల కోసం కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టవద్దని , అలాగే జనసేన వైపు వెళ్ళవద్దని సూచనలను ఆయన ఇచ్చినట్లు సమాచారం.టిడిపి జనసేన పొత్తు పెట్టుకుంటారనే ప్రచారంతో ముద్రగడ కూడా అలెర్ట్ అయినట్టు గా కనిపిస్తున్నారు .అందుకే కాపు సామాజిక వర్గం ఆ రెండు పార్టీల వైపు వెళ్లకుండా మూడో ప్రత్యామ్నాయం అంటూ ఒక వేదికను తెరపైకి తీసుకువచ్చారు.అందరూ అనుమానిస్తున్నట్లు గానే ముద్రగడ వైసీపీ కోసం పనిచేసినా,  కాపు సామాజిక వర్గం లో చీలిక తీసుకురావడమే ఆయన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు.

Telugu Ap Poltics, Chandrababu, Jagan, Kapu-Telugu Political News

ఇక అన్ని ప్రధాన పార్టీలు ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.ముద్రగడ ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గం పూర్తిగా తమవైపు ఉంటుందనే లెక్కలు బిజెపి, వైసిపీ, జనసేనలో ఉండగా, ముద్రగడ మాత్రం మౌనంగానే ఉంటూ కాపు సామాజికవర్గంలో చీలిక తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube