అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుతుంది.రాజకీయాలు, యంత్రాంగాన్ని అరచేతిలో పెట్టుకుని ఆడించిన నాయకులు నేడు ఏం చేస్తున్నారు ? అంటే యాక్టివ్ పాలిటిక్స్‌లో లేరు.మరోవైపు రాజకీయ భవిష్యత్ కనిపించట్లేదు.మరోవైపు వయసు మీదపడుతోంది.అయితే ఒక్కసారి రాజకీయం చేజారితే ఎవరూ పట్టించుకోరు.ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు, నలుగురు నోళ్లలో నాలుకలా ఉండా వారు నేడు నల్లపూసలైపోయారు.
అయితే రాజకీయ జిందగీలో జగజట్టీలుగా పేరున్న నాయకులు అనేకమంది ఉన్నారు.వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న.
ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ నేత ఎంవీ మైసూరారెడ్డి, నన్నపునేని రాజకుమారి, కనుమూరి బాపిరాజు.ఇలా అనేకమంది జగజట్టీలు ఉన్నారు.వీరందరూ ఒకప్పుడు రాజకీయాల్లో చక్రాలు తిప్పారు.ఒకవిధంగా చెప్పాలంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు సమకాలీకులుగా ఉన్నారు.మరి ఒకవైపు చంద్రబాబు దూకుడు రాజకీయాలు చేస్తుండగా మరి వారంతా ఏమైనట్టు ? రాజకీయాలకు శాశ్వతమైనట్టేనా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కానీ, తాము ఉన్నామంటూ అడపాదడపా మెరుపులు మెరిపిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో వీరి వ్యూహాలు ఏంటనేది ? చర్చగా మారుతోంది.

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నామని భావిస్తున్న వీరంతా పరోక్షంగా ఏదో ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నారు.ఇది అధికార పార్టీ వైసీపీలో గుబులు రేపుతోంది.దీనికి కారణం లేకపోలేదు.
ఇలాంటి వారి వల్ల ప్రమాదమేనని వైసీపీ అధిష్టానం భావిస్తోందట.వారు ఆర్థికంగా ప్రత్యర్థి పార్టీకి మద్దతు కూడగడతారని భావిస్తున్నారు.
ప్రత్యక్షంగా,పరోక్షంగా సహకరిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.గత ఎన్నికలకు ముందు కూడా సోషల్ మీడియా వేదికగా వీళ్లలాంటి నాయకులు టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు.
అది సత్ఫలితాలిస్తాయా లేదా అనేది పక్కన బెడితే వారి వారి సామాజిక వర్గాలను ప్రభావితం చేయడం చర్చకు దారితీస్తోంది.ప్రస్తుతం మరోసారి ఇలాంటి నేతల గురించి ప్రస్తావన వస్తోంది.
సోషల్ మీడియాలో వైసీపీ వ్యతిరేక ప్రచారంలో ఇలాంటి నేతల టాక్ వస్తోంది.మొత్తానికి ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వైసీపీ భావిస్తోందట.
మరి ఈ జగజట్టీల విషయంలో వైసీపీ ఎలా ముందుకు సాగుతుంది ? ఎలాంటి వ్యూహాలు రచిస్తుందనేది ? వేచి చూడాలి.







