అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నాగచైతన్య గత కొంతకాలం నుంచి మంచి విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.
ఇక సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య తన దూకుడు పెంచారు.విడాకుల ప్రకటన తర్వాత నాగచైతన్య వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న చైతన్య సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉంటారు.కేవలం తన సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే వెల్లడిస్తారు.
ఈ విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడం వల్ల ఈయనకు ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పాలి.అయితే తాజాగా ఈయన తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 70 లక్షలకు చేరింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్ గా, మరొక స్టార్ హీరోయిన్ కు భర్తగా ఉన్నప్పటికీ ఈయనకు సోషల్ మీడియాలో చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారనే చెప్పాలి.ఈ మధ్యకాలంలో నాగచైతన్య తన సినిమాలకి, తన బిజినెస్ కి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇతనికి సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ క్రమంగా పెరుగుతూ వస్తున్నారు.ఇతని సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చిత్రంలో నటించారు.
అలాగే మరో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు.







