'ఆర్ఆర్‌ఆర్‌' తో సందడి చేయబోతున్న మెగా 'గని'.. వెయ్యికి పైగా హంగామా

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.ఎట్టకేలకు ఈ సినిమా ను ఏప్రిల్ 8 వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

 Varun Tej Gani Movie Trailer With Rrr Movie , Allu Aravind , Film News , Gani-TeluguStop.com

ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్ల గా షురూ చేశారు.ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో కలిపి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా ట్రైలర్ ను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.దాదాపు వెయ్యి స్క్రీన్స్ కు పైగా మా ట్రైలర్ను ఆర్ఆర్ఆర్ సినిమా తో విడుదల చేయబోతున్నాం అంటూ చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

Telugu Allu Aravind, Allu Arvind, Allu Bobby, Bollywood, Gani, Jagapathi Babu, K

ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడిగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో జగపతి బాబు ఉపేంద్ర ఇంకా బాలీవుడ్ నటుడు కూడా నటించారు.ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే.బాక్సింగ్‌ నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమా కు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు.ఈ సినిమా తో అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి అల్లు బాబి పూర్తి స్థాయి నిర్మాత గా మారబోతున్నాడు.

ఆయన స్నేహితుడైన సిద్దు ముద్ద తో కలిసి ఈ సినిమా ను భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది.మెగా హీరో వరుణ్ తేజ్ కి ఈ సినిమా ఖచ్చితంగా ఒక బ్లాక్బస్టర్ హిట్ గా నిలుస్తుంది అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇస్తుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువ అయింది అంటూ ప్రచారం జరుగుతోంది.

సినిమాకు రాబోయే వసూలు అంతకు మించి ఉంటాయని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube