అమెరికా: ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భారత సంతతి చెఫ్ హత్య... ఇద్దరికీ జీవితఖైదు

మానవ సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయి.డబ్బు, నగలు, ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వారిని, స్నేహితుల్ని అత్యంత కిరాతకంగా హతమారుస్తున్నారు కొందరు వ్యక్తులు.

 Two Sentenced To Life Without Parole For Killing Bay Area Indian American Chef,-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భారత సంతతి వ్యక్తిని హత్య చేసిన ఇద్దరికి అమెరికా కోర్టు పెరోల్ లేకుండా జీవితఖైదు విధించింది.

వివరాల్లోకి వెళితే.

డొమినిక్ సర్కార్ అనే భారత సంతతి చెఫ్‌ కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నివసిస్తున్నారు.ఈ క్రమంలో 8,00,000 డాలర్ల విలువైన జీవిత బీమా సొమ్ము కోసం అతని భాగస్వామి మారియా మూర్ .మార్వెల్ సాల్వంత్ అనే వ్యక్తి చేత డొమినిక్‌ను 2018 అక్టోబర్‌లో హత్య చేయించింది.ఆయన ఫ్రీమాంట్‌లోని తన అద్దె ఇంట్లో నిద్రిస్తుండగా కాల్చి చంపబడ్డాడు.

ఇండియాకు వెళ్లడానికి ఒక రోజు ముందు డొమినిక్ సర్కార్ హత్యకు గురయ్యాడు.

డొమినిక్ హత్యకు మరొక వ్యక్తి కారణమని సాల్వంత్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.

ఈ ఏడాది ఫిబ్రవరిలో మూర్, సాల్వంత్‌లను దోషులుగా జ్యూరీ నిర్ధారించింది.అంతేకాకుండా హత్య కోసం తుపాకీని వాడినందుకు గాను సాల్వంత్‌కు అదనంగా మరో 25 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు ది మెర్క్యురీ న్యూస్ వెల్లడించింది.

Telugu American, Calinia, Chef Indian, Dominic Sarkar, Maria Moore, Marvel, Merc

ఏప్రిల్ 2016లో డొమినిక్ సర్కార్ 5,00,000 డాలర్ల విలువైన జీవిత బీమా పాలసీని కొనుగోలు చేశారు.భారత్‌లోని తన ముగ్గురు కుమార్తెలను కూడా డొమినిక్ లబ్ధిదారులుగా చేర్చారు.అయితే 2016 సెప్టెంబర్‌లో సర్కార్ ముగ్గురు కుమార్తెలను ఆకస్మిక లబ్ధిదారులుగా ఎలిమినేట్ చేస్తూ మూర్ పాలసీని మార్చింది.ఏడాది తర్వాత సర్కార్ ఇప్పటికే వున్న పాలసీకి అదనంగా మరో 3,00,000 డాలర్లను చేర్చాడు.

అంతేకాకుండా మళ్లీ తన ముగ్గురు కుమార్తెలను ఆకస్మిక లబ్ధిదారులుగా చేర్చాడు.

అయితే డొమినిక్ హత్యపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.

మూర్‌ను ప్రాథమిక లబ్ధిదారునిగా చేర్చడం, సర్కార్ ముగ్గురు కూతుళ్లను ఎలిమినేట్ చేసేందుకు పాలసీని సవరించినట్లు కనుగొన్నారు.సర్కార్ హత్యకు నెల ముందు మూర్ 500 డాలర్లను సాల్వంత్‌కు పంపినట్లు గుర్తించారు.

డొమినిక్ సర్కార్ హత్యకు కొన్నిరోజుల ముందు మూర్ , సాల్వంత్‌ల సెల్‌ఫోన్ కాల్ డేటా, ఇంటి వద్ద వున్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను బట్టి పోలీసుల అనుమానం నిజమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube