ఇటీవలి కాలంలో హత్యలు, దోపిడీలు, బడా కుంభకోణాలకు పాల్పడిన కొందరు మనదేశాన్ని విడిచి విదేశాల్లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ తదితర ఆర్ధిక నేరగాళ్లు.
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు ఎగిరిపోతున్న సంగతి తెలిసిందే.అలాగే పలువురు నర హంతకులు, గ్యాంగ్‌స్టర్లు కూడా ఫారిన్‌లో తలదాచుకుంటున్నారు.
వీరిని భారత్‌కు రప్పించేందుకు మన దర్యాప్తు సంస్థలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.ఈ నేపథ్యంలో ఇలాంటి వారి వల్ల పంజాబ్ పోలీసుల తల బొప్పి కడుతోంది.
వివరాల్లోకి వెళితే… కెనడాలో వున్న గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాపై హత్య, హత్యాయత్నం, కాల్పులు వంటి దాదాపు 20 క్రిమినల్ కేసులు వున్నాయి.తరన్ తారన్ జిల్లాలోని హరికేకి చెందిన లాండాపై ఈ స్థాయిలో కేసులు వున్నా.
అతను రెండేళ్ల క్రితం విదేశాలకు పారిపోయాడు.ఈ నేపథ్యంలో అతని అప్పగింత సహా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు.
లాండా సహా విదేశాలకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్లు తమకు తలనొప్పిగా మారారని అధికారులు అంటున్నారు.సోషల్ మీడియాతో పాటు ఇక్కడ వున్న పరిచయాలు, పలువురి అండదండల కారణంగా వారిని అదుపులోకి తీసుకోవడం సాధ్యం కావడం లేదని చెబుతున్నారు.
లాండా విషయానికి వస్తే.అతనిపై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ తరన్ తారన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.వ్యాపారులు, కాలనీవాసులు, డాక్టర్లను బెదిరించి ఇతను వసూళ్లకు పాల్పడేవాడని పోలీసులు చెబుతున్నారు.గతేడాది జూలైలో అమృత్‌సర్ రూరల్ పోలీసులు, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ యూనిట్ (ఓసీసీయూ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో పట్టుబడ్డ దయాసింగ్, ప్రీత్ సెఖోన్‌లను విచారించిన సమయంలో లాండా పేరు కూడా వినిపించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తరన్ తారన్ జిల్లాలోని చంబా ఖుర్ద్ గ్రామానికి చెందిన లాండా అనుచరుడు జర్మన్‌జిత్ సింగ్ అలియాస్ నిక్కా ఖదురియాను చమియారీ గ్రామంలో పోలీసులు అరెస్ట్ చేశారు.విచారణ సందర్భంగా లాండా ఆదేశాల మేరకు ప్రీత్ సెఖోన్ అంతర్జాతీయ స్థాయి హవాలా ఆపరేటర్‌కు చెందిన బ్యాంక్ ఖాతాలో 25 మంది వ్యక్తుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల విషయం వెలుగుచూసింది.

ఈ నేపథ్యంలో లాండా సహా మరో గ్యాంగ్‌స్టర్ అర్ష్ ధల్లాపైనా రెడ్‌కార్నర్ నోటీసుతో పాటు అప్పగింతకు సంబంధించి ప్రక్రియను వేగవంతం చేశారు పోలీసులు.అలాగే ఈ విషయంలో సహకరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో తమ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారని తరన్ తారన్ జిల్లా ఎస్ఎస్‌పీ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు.







