టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా రూపొందిన సినిమా ఆర్ఆర్ఆర్.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకుల ఎదురుచూపులలో కాయలు కాసాయని చెప్పవచ్చు.
మల్టీ స్టారర్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ లను తెరపై చూపించడానికి జక్కన్న బాగానే కష్టపడ్డాడు.
మొత్తానికి ఈ సినిమా ఎన్నో వాయిదాలతో గట్టెక్కి ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్స్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.గత కొన్ని రోజుల నుండి ఈ సినీ బృందం ప్రమోషన్స్ భాగంలో బాగా బిజీగా మారారు.
పలు భాషలలో ఇంటర్వ్యూలలో పాల్గొని తమ సినిమా గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు.ఇక ఇటీవలే ఈ సినిమా సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఇంటర్వ్యూ చేసి బాగా సందడి చేశాడు.
ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమా కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ గురించి తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

నిజానికి ఈయన సినిమా ప్రమోషన్స్ లలో బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో కనిపించకపోయేసరికి ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు.ఇంతకూ ఆయన ఎందుకు ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు అని బాగా ప్రశ్నలు ఎదురవ్వడం తో తాజాగా ఈ విషయం గురించి కొన్ని విషయాలు బయట పడ్డాయి.
ప్రస్తుతం వయసు సంబంధిత సమస్యల కారణంగా కోవిడ్ పాండమిక్ రిస్కు చేయడం కష్టమని దాంతో ఆయననే తనంతట తాను ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.దీంతో ప్రతి ఒక్కరు ఇదే కారణం ఉండవచ్చని అనుకుంటున్నారు.








