అయ్యో శేఖర్ మాస్టర్... కూతురితో డాన్స్ చేసిన విమర్శలు తప్పలేదా?

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ అందరికీ సుపరిచితమే.ఈయన కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

 Shekhar Master Has Lot Of Controversy For The Dancing With A Daughter Dance , Sh-TeluguStop.com

అలాగే ఏదైనా స్పెషల్ ఈవెంట్ లో కూడా శేఖర్ మాస్టర్ సందడి చేస్తుంటారు.ఇకపోతే ఈ హోలీ పండుగ సందర్భంగా స్టార్ మా నిర్వహించిన ఈ హోలీకి తగ్గేదేలే  అనే కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శేఖర్ మాస్టర్ తన కూతురు సాహితీతో కలిసి చంద్రుళ్ళో ఉండే కుందేలు అనే పాటకు డాన్స్ వేశారు.

Telugu Controversys, Dance, Romantic, Saahithi, Shekhar Master, Maa, Telugu, Tol

ఈ పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా వీరిద్దరి డాన్స్ పర్ఫామెన్స్ కు 99% మంచి మార్కులు పడటమే కాకుండా ఎంతో మంది ఈ పాట పై ప్రశంసలు కురిపించారు.అయితే ఒక్క శాతం మంది మాత్రం ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

శేఖర్ మాస్టర్ ఎంపిక చేసుకున్న పాట ఎలాంటి రొమాంటిక్ సాంగ్ కాదు.కాని ఒక సీనియర్ జర్నలిస్టు తన ఫేస్ బుక్ పేజీలో తండ్రి కూతురీ డాన్స్ పర్ఫార్మెన్స్ ఏంటో… అంటూ విమర్శలు చేశారు.

Telugu Controversys, Dance, Romantic, Saahithi, Shekhar Master, Maa, Telugu, Tol

ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ సాహితి డాన్స్ పెర్ఫార్మెన్స్ పై వస్తున్న విమర్శలను కొందరు తిప్పి కొడుతున్నారు.మరికొందరు మాత్రం శేఖర్ మాస్టర్ ఇది కూతురుతో కలిసి చేయాల్సిన పాట కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఇది ఏమాత్రం రొమాంటిక్ సాంగ్ కాకపోయినా శేఖర్ మాస్టర్ చివరికి కూతురుతో డాన్స్ చేసిన తనకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి విమర్శలు తప్పలేదు.మరి శేఖర్ మాస్టర్ గురించి వస్తున్నటువంటి ఈ విమర్శలపై మాస్టర్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube