టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సరైన కథ దర్శకుడు దొరికితే తప్పకుండా తన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తానని గతంలో అల్లు అర్జున్ వెల్లడించారు.అయితే తాజాగా అల్లు అర్జున్ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీను కలవడంతో అతనితో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.
అయితే అలాంటిదేమీ లేదని అల్లు అర్జున్ సన్నిహితుల ద్వారా అసలు విషయం తెలిసింది.
అల్లుఅర్జున్ ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీ కి వెళ్లడానికి మరొక కారణం కూడా ఉందని తెలుస్తోంది.
అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ను బాలీవుడ్ ఎంట్రీ కోసం అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రముఖ కంపెనీలతో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లు సమాచారం.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మాత్రమే కాకుండా కథా ప్రాధాన్యత ఉన్న పాత్రలు వచ్చేలా చేయడం కోసం అల్లు అర్జున్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అల్లు శిరీష్ గతంలో నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్ అవుతూ అక్కడ మంచి ఆదరణ పొందాయి.ఈ క్రమంలోనే అల్లు శిరీష్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ విధంగా తన తమ్ముడి బాలీవుడ్ ఎంట్రీ కోసం అర్జున్ పెద్ద కృషి చేస్తున్నాడు.ఇక అల్లు అరవింద్ కూడా బాలీవుడ్ నిర్మాతలతో కలిసి సినిమాలు చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే మరి అల్లు శిరీష్ కోసం అల్లు అర్జున్ పడుతున్న కష్టాలకి ఫలితం ఉంటుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.







