రాధేశ్యామ్ విషయంలో అదే జరిగింది... సినిమా తలరాతలను థియేటర్లు మారుస్తాయి: పూజా హెగ్డే

బుట్ట బొమ్మ పూజా హెగ్డే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కలిసి నటించిన చిత్రం రాధేశ్యామ్.పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 That Thing Happened In The Case Of Radheshyam Theaters Change The Movie Meaning-TeluguStop.com

బాహుబలి, సాహో వంటి అద్భుతమైన సినిమాల తర్వాత ఈ సినిమా విడుదల కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయి బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఇలా ప్రేక్షకులను సందడి చేయ లేక పోవడానికి గల కారణాలు గురించి చిత్రబృందం పలుసార్లు చర్చించారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే తాజాగా ఈ సినిమా పై స్పందించారు.

బాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే మాట్లాడుతూ…కొన్ని సినిమాలు యావరేజ్ అనిపించిన థియేటర్ వద్ద ఊహించని విధంగా విజయాలను అందుకుంటాయి.మరికొన్ని సినిమాలు కంటెంట్ అద్భుతంగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేయలేక పోతాయి.

రాధేశ్యామ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది.ఎలాంటి సినిమాలైనా వాటి తలరాతలు బాక్సాఫీస్ వద్ద మారిపోతాయని నేను బలంగా నమ్ముతాను అంటూ పూజా హెగ్డే వెల్లడించారు.

Telugu Pooja Hegde, Prabhas, Radheshyam, Theaters, Tollywood-Movie

ఇక ఈ సినిమా ప్రేక్షకులను సందడి చేయలేకపోవడానికి ఎన్నో కారణాలు వినపడుతున్నాయి.ఈ సినిమాలో ఒక యాక్షన్ సన్నివేశం కూడా లేదని కొందరు భావించగా మరి కొందరు పూజా హెగ్డే ప్రభాస్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.కారణాలు ఏవైనా సినిమా మాత్రం ప్రేక్షకులను అంచనాలను చేరుకోలేక పోయింది.దర్శకుడు రాధాకృష్ణ నెగిటివ్ కామెంట్స్ కొట్టిపారేశారు.తన సినిమాను, టేకింగ్ ని సమర్ధించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube