ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో అభిమానులు ఎంతో ఆతృతగా గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూశారు.
ఇక 25వ తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం కూడా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా మల్టీస్టారర్ సినిమా అనే విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు.
సాధారణంగా ఈ ఇద్దరి హీరోలకు విపరీతమైన క్రేజ్ ఉంది.
అలాంటి ఇద్దరు కలిసి ఒకే తెరపై సందడి చేయనున్నారని తెలియడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.ఇక ఈ సినిమా విడుదలైతే థియేటర్లో చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.
ఇక ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని థియేటర్ ఓనర్స్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ భారీ డైలాగులు చెప్పినప్పుడు అభిమానుల స్క్రీన్ దగ్గరికి వెళ్లి పోడియం పై ఎక్కి డాన్సులు చేయడం వంటివి చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇలా అభిమానులు స్క్రీన్ దగ్గర పోడియం పైకి ఎక్కి స్క్రీన్లను చింపడం, చిందులు వేయడం, థియేటర్లకు నష్టం కలిగించే పనులు చేస్తారనే ఉద్దేశంతో థియేటర్ ఓనర్ లు ముందుగా సీట్లకు స్క్రీన్ కు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఇనుప మేకులను అమర్చారు.అదేవిధంగా స్క్రీన్ పోడియం పైకి ఎక్కడానికి వీలులేకుండా ఇనుప కంచె వేశారు.ఇలా థియేటర్లు దెబ్బతినకుండా థియేటర్ ఓనర్ లు ఇలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







