దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.
ఈ సినిమా గతంలోనే భారీ ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే.మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నాడు.
క్షణం తీరిక లేకుండా వరుస ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా మరొక నాలుగు రోజుల్లోనే రిలీజ్ అవ్వబోతుండగా ప్రధాన నగరాలన్నీ చుట్టేస్తూ వరుస ప్రొమోషన్స్ చేస్తున్నాడు.
తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో తన సినిమాలు ఎందుకు అన్నీ సక్సెస్ అవుతున్నాయో హిట్ ఫార్ములా చెప్పేసాడు.ఢిల్లీ లో జరిగిన ఈవెంట్ లో రాజమౌళి ని ఒక విలేకరి సినిమాలో పాత్రలు గురించి ప్రశ్నించాడు.రాజమౌళి ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.
”రాజమౌళి తన చిన్నప్పుడు విన్న కథల నుండి ఇమాజినేషన్ చేసుకుంటారని తెలిపారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను తాను చిన్నప్పుడు విన్న చదివిన కథ లనుండి.ఆ తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్, ఆ రియల్ హీరోలు ఎలా ఉండాలి అని తాను ఉహించుకున్నా దాన్నే సినిమాలో చుపించానని తెలిపారు.ఇలా రాజమౌళి సృష్టించే అన్ని పాత్రలు కూడా యూనిక్ గా ఉంటాయి కాబట్టే ఆయన సినిమాలు సక్సెస్ అవుతాయి.మరి అలాంటి దర్శకుడు ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అనే చెప్పాలి.

ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతా రామ రాజుగా నటిస్తుంటే.ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నాడు.ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.