గుంటూరు జిల్లా మంగళ గిరి లోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు బోయ సునీత అనే జనసేన వీర మహిళ తనకు తగిన న్యాయం చేయాలని పార్టీ కార్యాలయం ముందు సోమవారం ఉదయం నిరసన వ్యక్తం చేసింది ,ఆమె మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీ వాసు అనే వ్యక్తి నన్ను లైంగికంగా వాడుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వాపోయింది, ఇదే విషయాన్ని హైదరాబాద్ లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటే నన్ను మానసిక వికలాంగురాలి గా చిత్రీకరించి పబ్బం గడుపుతున్నారని అతనిపై తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.గతంలో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు తాను పార్టీ కోసం కష్ట పడ్డానని ఆ సమయంలో బన్నీవాసు నాకు మంచి భవిష్యత్తు చూపిస్తారని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది, హైదరాబాదులో పవన్ కళ్యాణ్ కలుద్దామని ప్రయత్నిస్తే అక్కడ నన్ను అడ్డు కుంటున్నారు.
అనే ఉద్దేశంతో మంగళగిరి లోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చానని వివరించింది.
పవన్ కళ్యాణ్ కు మహిళగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని బన్నీవాసును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది.
జనసేన పార్టీ కి బన్నివాసు సంబంధం గూర్చి వివరిస్తూ మొన్న జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో బన్నీ వాసు ను పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయ కమిటీ మెంబర్ గా ప్రకటించారని రాబోవు ఎన్నికల్లో పాలకొల్లు నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్నారని ఇటువంటి వ్యక్తి కి పార్టీలో క్రియాశీలక పదవులు అప్పగిస్తే జనసేన వీర మహిళలకు అన్యాయం జరుగు తుందని పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటుందని వివరించింది .ఇటువంటి వారిని శిక్షించే తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.







