టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వర్మ నిత్యం ఏదో ఒక వివాదంతో,వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.
సోషల్ మీడియాలో వ్యంగంగా కామెంట్స్ చేస్తూ.ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో అని కూడా ఆలోచించకుండా వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.
అలాగే సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శలను కూడా పట్టించుకోకుండా కొట్టిపారేస్తూ ఉంటాడు.ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ ని, ఆయన మాట్లాడే మాటలు, చేసే పనులు, చేసే ట్వీట్ లను బట్టి చూస్తే పెనుమార్పులు కనిపిస్తున్నాయి.

ఈ మధ్య ఎక్కువగా ఫిలాసఫీ, ఫీలింగ్స్ అంటూ మాట్లాడుతున్నారు.అదేవిధంగా ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడే వర్మ, ఈమధ్య ఎవరి జోలికి పోవడం లేదు.ఇకపోతే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన న్యూస్ ది కాశ్మీరి ఫైల్స్ సినిమా.ఈ సినిమాపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
రాంగోపాల్ వర్మ నిర్మించిన డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కూడా బిజీ బిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ కొన్ని మొక్కలు నాటారు.
అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

సమాజం కోసం వర్మ ఒక మంచి పని చేశారు అనుకుంటే ఇంతలోపే రామ్ గోపాల్ వర్మ అది నేను కాదు.నాకు పచ్చదనం, మట్టి అంటే నచ్చదు అంటూ ట్వీట్ చేశాడు.అంతేకాకుండా ఫొటోలో మొక్కలు నాటుతూ కనిపిస్తున్నది నేను కాదు అని వర్మ అంటున్నాడు రాంగోపాల్ వర్మ.
వర్మ చేసిన ట్వీట్ బట్టి చూస్తే.అతనికి ఇలాంటి మంచి పనులు నచ్చవు.
ఇలాంటి మంచి పనులు కూడా అతను చేయడు, అందువల్లే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని తాను కాదు అంటూ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







