యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు.తాజాగా చరణ్, తారక్ ఎం.
ఎం.కీరవాణి నిర్వహించిన చిట్ చాట్ లో పాల్గొన్నారు.తాను ఇంతవరకు చేసిన పాటలలో నచ్చని పాట చెప్పాలని కీరవాణి కోరగా తనకు భీమవరం బుల్లోడా పాలు కావాలా పాట నచ్చదని తారక్ వెల్లడించారు.తనకు ఒక పాట నచ్చలేదని అయితే ఆ పాట ఏంటో గుర్తులేదని చరణ్ చెప్పుకొచ్చారు.
సీతయ్య, సింహాద్రి షూటింగ్ ఒకే సమయంలో జరిగిందని రాజమౌళికి సీతయ్య సినిమాలోని ఒక్క మగాడు సాంగ్ అంటే చాలా ఇష్టమని కీరవాణి తెలిపారు.బంగారు కోడిపెట్టె కొత్త వెర్షన్ ఇష్టమా పాత వెర్షన్ ఇష్టమా అని కీరవాణి అడగగా తనకు పాత వెర్షన్ ఇష్టమని చరణ్ చెప్పుకొచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ ను ఫేవరెట్ సింగర్ ఎవరని అడగగా అరవింద సమేత సినిమాలో మోహన భోగరాజు పాడిన రెడ్డెమ్మ తల్లి పాట సినిమాకు ఎంతో న్యాయం చేసిందని తారక్ తెలిపారు.

సింగర్లలో జై బాలయ్య పాట పాడిన గీతామాధురి అంటే తనకు ఎంతో ఇష్టమని తారక్ చెప్పుకొచ్చారు.చరణ్ తనకు మోహన భోగరాజు, మంగ్లీ సింగర్స్ లో ఇష్టమని చరణ్ తెలిపారు. రాజమౌళి, శ్రీవల్లి, కార్తికేయ, దానయ్య నుంచి మిస్డ్ కాల్స్ వచ్చి మొబైల్ లో 1 పర్సెంట్ ఛార్జింగ్ ఉంటే ఎవరికి కాల్ చేస్తారని కీరవాణి తారక్ ను అడగగా తాను శ్రీవల్లి గారికి కాల్ చేస్తానని తారక్ చెప్పుకొచ్చారు.
తాను శ్రీవల్లిని అమ్మ అని పిలుస్తానని తారక్ వెల్లడించారు.

శ్రీవల్లిగారిని అలా పిలవడం తనకు ఎప్పటినుంచో అలవాటని తారక్ కామెంట్లు చేశారు.మా అమ్మ ఇప్పుడు నన్ను తిట్టడం మానేసిందని నన్ను తిట్టే హక్కు ఉన్న ఆడవాళ్లు సొంత అమ్మతో పాటు శ్రీవల్లి అని తారక్ పేర్కొన్నారు.శ్రీవల్లి అమ్మకు కాల్ చేస్తే మిగతా అందరికీ చేసినట్టేనని తారక్ చెప్పుకొచ్చారు.







