మా జీవితాల్లోకి తెచ్చినందుకు థ్యాంక్స్.. సుప్రీత కన్నీరుమున్నీరు

తెలుగు ప్రేక్షకులకు యాక్టర్ సురేఖ వాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

 Thanks For Bringing It Into Our Lives Supritha Emotional Details, Supritha, Tol-TeluguStop.com

ఇక ప్రస్తుతం గ్లామర్ హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ ను చూపిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.

తన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే.

ఈమెకు తనెత్తు కూతురు కూడా ఉంది.ఆమె పేరే సుప్రీత.

ఇక తన కూతురుకు ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయం కూడా లేదు.కానీ తన ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది సుప్రీత.

నిజానికి సుప్రీత సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఇక తన తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.నిజానికి ఆమె సురేఖవాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.

చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.

Telugu Car, Friend, Gayathri Dolly, Supritha, Supritha Friend, Surekha Vani, Tol

పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు తన ఇన్స్టా వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.

అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది.ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.

ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి మదిలో గుడి కట్టేసుకుంది కాబట్టి.ఇక ఈమె తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

వాళ్ల తో దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.గతంలో ఈమె ఓ ప్రైవేట్ ఆల్బమ్ లో కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఆ ఆల్బమ్ మంచి సక్సెస్ అందుకుంది.

Telugu Car, Friend, Gayathri Dolly, Supritha, Supritha Friend, Surekha Vani, Tol

ఇదిలా ఉంటే తాజాగా తను ఓ విషయంలో ఎమోషనల్ అయింది.ఇటీవలే తన స్నేహితురాలు, సోషల్ మీడియా సెలబ్రిటి కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన సంగతి తెలిసిందే.దీంతో ఆమె ఫోటో షేర్ చేసుకొని తనకు సంతాపం తెలిపి బాగా బాధ పడింది.

ఇక అప్పటి నుంచి తనకు సంబంధించిన ఫోటోలను, తనతో గడిపిన కొన్ని జ్ఞాపకాలు పంచుకుంటూ ఉంది సుప్రీత.

ఇక తాజాగా తన ఇన్ స్టా లో మరో పోస్ట్ షేర్ చేసింది.

అందులో ఓ కుక్క పిల్లను తనకు గిఫ్ట్ గా ఇచ్చినట్లుగా కనిపించగా.ఆ కుక్క పిల్లను తమ జీవితాల్లోకి తెచ్చినందుకు థాంక్స్ అంటూ ఎమోషనల్ అయింది.

ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.సుప్రీతకు వెండితెరపై నటించే ఆసక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా తనను వెండితెరకు పరిచయం చేస్తానని గతంలో సురేఖ వాణి తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube