వేస‌వి వేడి వ‌ల్ల పొడి బారిన‌ చ‌ర్మాన్ని రిపేర్ చేసే బెస్ట్ రెమెడీ ఇదే!

వేస‌వి కాలం రానే వ‌చ్చింది.పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

 Best Remedy For Dry Skin In Summer Details! Best Remedy, Dry Skin In Summer, Dry-TeluguStop.com

అయితే వేస‌వి వేడి కార‌ణంగా కొంద‌రి చ‌ర్మం పొడి బారిపోతుంటుంది. దాంతో ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ఖ‌రీదైన మాయిశ్చ‌రైజ‌ర్లు, లోష‌న్లు యూజ్ చేస్తుంటారు.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే వేస‌వి వేడి వ‌ల్ల పొడి బారిన‌ చ‌ర్మాన్ని సుల‌భంగా రిపేర్ చేసుకోవ‌చ్చు.

మ‌రి ఆ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.

తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో గుప్పెడు ఎండ‌బెట్టుకున్న క‌మ‌లా తొక్క‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ పెస‌ర ప‌ప్పు, రెండు టేబుల్ స్పూన్ల చంద‌నం పొడి, కొన్ని ఎండ‌బెట్టిన‌ గులాబీ రేకులు, మ‌రికొన్ని ఎండ‌బెట్టిన‌ చామంతి రేకులు, ప‌చ్చి ప‌సుపు కొమ్ము చిన్న‌ది, వ‌న్ టేబుల్ స్పూన్ వ‌ట్టి వేరు వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పొడిని బౌల్‌లోకి తీసుకుని.అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం,

Telugu Tips, Remedy, Dry Skin, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health

వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్‌ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖంతో పాటు శ‌రీరం మొత్తానికి ప‌ట్టించి ఐదు నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ వాట‌ర్‌తో క్లీన్ చేసుకుని.

సోప్‌ను వాడ‌కుండా స్నానం చేసేయాలి.ఆపై మీ స్కిన్‌కు సూట్ అయ్యే మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.

ఇలా వారంలో మూడు సార్లు చేస్తే గ‌నుక పొడి బారిన చ‌ర్మం మ‌ళ్లీ మృదువుగా, తేమ‌గా మారుతుంది.అలాగే స‌న్ ట్యాన్ స‌మ‌స్య దూరం అవుతుంది.

మ‌చ్చ‌లు, మొటిమ‌లు ఉన్నా తొల‌గిపోయి స్కిన్ క్లియ‌ర్‌గా, బ్రైట్‌గా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube