హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమ మోహన్ ప్రేమలో ఉన్నారని, కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకొని ఒక్కటవబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి హీరో గౌతమ్ కార్తీక్ ఒక కోలీవుడ్ స్టార్ హీరో కుమారుడు అన్న విషయం తెలిసిందే.గౌతమ్ కార్తీక్ తెలుగులో సీతాకోకచిలుక సినిమా తో అందరికీ పరిచయం అయ్యాడు.
ప్రస్తుతం హీరో కార్తీక్ తమిళంలో వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.హీరో కార్తీక్ మలయాళ ముద్దుగుమ్మ మంజిమ మోహన్ తో గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నట్టు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి తో ఇద్దరు ఒక్కటవబోతున్నారు అని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇదే విషయంపై హీరోయిన్ మంజిమ మోహన్ స్పందిస్తూ.
తాను గౌతమ్ కార్తీక్ ప్రేమను అంగీకరించలేదని తెలిపింది.అలాగే ప్రేమ పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు కాబట్టి వాటిని దాచే అవసరం తనకు లేదు అని ఆమె తెలిపింది.
అదేవిధంగా ఆమె గౌతమ్ తో రిలేషన్ లో వుంది అని వార్తలు విని ఆమె షాక్ అయిందట.తనని తన తల్లిదండ్రులు ఏమని అనుకుంటున్నారు అని టెన్షన్ పడిందట.
కానీ ఆమె తల్లిదండ్రులు ఆ విషయాన్ని లైట్ గా తీసుకోవడంతో టెన్షన్ రిలీప్ అయ్యింది అని చెప్పుకొచ్చింది మంజిమ మోహన్.
మంజిమా మోహన్ నాగ చైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.మొత్తానికి మంజిమా మోహన్ తనపై వస్తున్న వార్తలకు పులిస్టాప్ పెట్టేసింది.
అదేవిధంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల పై తనకు ఎటువంటి భయం లేదని తెలిపింది.ఈమె స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ కుమార్తెలు ఒకరి గా నటించింది.
దర్శకుడు మణిరత్నం హీరో గౌతమ్ కార్తీక్ ను కడలి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే.