దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతా రామ రాజుగా నటిస్తుంటే.
ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమా విడుదల చేయాలనీ చూసినప్పుడల్లా ఏదొక సమస్య వస్తూనే ఉంది.
పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.
ఈ సినిమా గతంలోనే భారీ ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే.
మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ కు రెడీ అవుతున్నాడు జక్కన్న.ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 19న గ్రాండ్ గా జరగనుంది.
బెంగుళూరు లోని చిక్కబళ్లాపూర్ లో ఈ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరగనుంది.ఈ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి.
ఈ వేడుకకు ముఖ్య అతిధిగా కర్ణాటక సీఎం వస్తున్నాడని మొన్నటి నుండే వార్తలు వచ్చాయి.అదే విషయం నిజం చేస్తూ రాజమౌళి ఈ విషయాన్నీ కన్ఫర్మ్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా ఎవరు రాబోతున్నారో చెప్పేశాడు.

ఈ సాయంత్రం జరగనున్న ఈవెంట్ గురించి ఆయన చెబుతూ.”నిన్న లేట్ నైట్ దుబాయ్ నుండి బెంగుళూరు లో ల్యాండ్ అయ్యాం.అయినా కూడా వెంకట్ గారు ఆయన ప్రొడక్షన్ నుండి హృదయ పూర్వకంగా వెల్కమ్ చెప్పేసారు.ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఈవెంట్ ఎలా అని టెన్షన్ పడ్డాను.
కానీ వెంకట్ గారు ఏర్పాట్లు నేను చూస్తాను.క్రియేటివ్స్ మీరు చూసుకోండి అని అన్నారు.
ఇక ఈ రోజు ఈ వేడుకకు సీఎం వస్తున్నారు.ఫుల్ ప్రోటోకాల్ ఉంటుంది.
జాగ్రత్తగా ఉండండి.మీ కేకలు, అరుపుల కోసం వేచి చూస్తున్నాను.
అంటూ రాజమౌళి ఎంతో సంతోషంగా ట్వీట్ చేసారు.దీంతో ఈ రోజు సాయంత్రం గెస్ట్ ఎవరో తెలిసి పోయింది.