భారతదేశంలో జంతువులను పూజించే అనేక దేవాలయాలు ఉన్నాయి.ఇప్పుడు మనం భారతదేశంలో కప్పలను పూజించే ఏకైక ఆలయం గురించి తెలుసు కుందాం.
ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడి వారు కప్పను ఎందుకు పూజిస్తారనే వివరాలు ఇప్పుడు తెలుసు కుందాం.భారతదేశం లోని కప్ప దేవాలయం ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్-ఖీరి జిల్లాలోని ఓయిల్ పట్టణంలో ఉంది.
ఈ దేవాలయం సుమారు 200 సంవత్సరాల నాటిదని చెబుతారు.కరువు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించడానికి ఈ ఆలయం నిర్మించారని చెబుతారు.
శైవ శాఖకు ప్రధాన కేంద్రంగా నిలిచింది.ఇక్కడి పాలకులు శివుని ఆరాధకులు.
ఈ పట్టణం మధ్యలో ఒక పురాతన శివాలయం ఉంది.ఈ ప్రాంతం పద కొండవ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు చహమనా పాలకుల ఆధీనంలో ఉంది.
చహమనా రాజ వంశానికి చెందిన రాజా భక్ష్ సింగ్ ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు.ఆలయ నిర్మాణాన్ని కపిల తాంత్రికుడు చేపట్టాడు.
తాంత్రికత పై ఆధారపడిన ఈ ఆలయ నిర్మాణం దాని ప్రత్యేక శైలి కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.కప్ప గుడికి దీపావళితో పాటు మహా శివరాత్రి రోజున కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
లఖింపూర్ నుండి 11 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా లఖింపూర్ చేరుకుని టాక్సీని లో ఆలయానికి చేరేకోవచ్చు.మీరు విమానంలో రావాలను కుంటే.ఇక్కడి నుండి సమీప విమానాశ్రయం లక్నో 135 కి.మీ దూరంలో ఉంది.ఇక్కడ నుండి లఖింపూర్‌కు యూపీఎస్ ఆర్టీసీ బస్సులు నడుస్తాయి.