రాతి విగ్రహం అంటే చాలా పెద్ద రాయి లేదా కొండను చెక్కి విగ్రహంగా మలచడం.రాతి విగ్రహాలను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది.ఇప్పుడు మనం ప్రపంచంలోని అత్యంత భారీగా ఉన్నా అద్భుతమైన రాతి విగ్రహాల గురించి తెలుసుకుందాం.1.గ్రేట్ సింహిక: ఈజిప్ట్గ్రేట్ సింహిక ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద విగ్రహాలలో ఒకటి.ఇది వేల సంవత్సరాలుగా పెద్ద రహస్యంగా నిలిచింది.
పురావస్తు శాస్త్రంలో కూడా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది.దీనికి గ్రీకు పురాణ కాలం నాటి జంతువు పేరు పెట్టారు.2 .లెషన్‌లోని జెయింట్ బుద్ధ విగ్రహం : చైనాచైనాలోని లెషాన్‌లో రాతిపై నిర్మించిన బుద్ధ భగవానుడి విగ్రహం 233 అడుగుల (71 మీ) ఎత్తు ఉంది.ఈ విగ్రహాన్ని 8వ శతాబ్దంలో షిజువో కొండపై నిర్మించారు.ఈ విగ్రహం మూడు నదులను చూస్తున్నట్లుగా ఉంది.దాని ముఖం అమీ పర్వతం వైపు తరిగి ఉంటుంది.అమీ పర్వతం బౌద్ధులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం.ఇక్కడ 13 అంతస్తుల చెక్క నిర్మాణం కనిపిస్తుంది.3.షాపర్- I విగ్రహం: ఇరాన్

ఇది రెండవ సస్సానియన్ రాజు షాపర్- I కు చెందిన విగ్రహం.షాపర్ 240 AD నుండి 272 AD వరకు పాలించాడు.అతను కఠినమైన పాలకునిగా పేరొందాడు.21 అడుగుల (6.7 మీ) ఎత్తైన విగ్రహం షాపూర్ గుహలో కనిపిస్తుంది.ఈ ప్రదేశం పురాతన నగరమైన బిసాపూర్‌కు సమీపంలో ఉంది.14వ శతాబ్దం తర్వాత భూకంపాల వల్ల ఈ విగ్రహం దెబ్బతిన్నది.అయినప్పటికీ దాని ఆదరణ తగ్గలేదు.4.తీర్థంకర శిల్పాలు : గ్వాలియర్భారతదేశంలోని పురాతన జైన దేవాలయాలు, గుహ దేవాలయాలలో తీర్థంకరుల శిల్పాలు కనిపిస్తాయి.మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఒక కొండపై వందకుపైగా తీర్థంకర విగ్రహాలు కనిపిస్తాయి.







