ఆరోగ్య బీమా సంస్థలు తమ పాలసీదారులకు బోనస్ ఆఫర్ చేస్తాయనే విషయం చాలా మందికి తెలియదు.ముఖ్యంగా క్యుములేటివ్ బోనస్ గురించి తెలియక పాలసీదారులు ఒక్కోసారి నష్టపోతుంటారు.
మరి హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎలా బోనస్ సంపాదించాలి? వీటి వల్ల చేకూరే ప్రయోజనాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పర్సనల్, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలకు క్యుములేటివ్ బోనస్ వర్తిస్తుంది.
ఇన్సూరెన్స్ లో బోనస్ అంటే బీమా కంపెనీలు మీ పాలసీ వ్యాల్యూని పెంచడమని అర్థం.అయితే పాలసీ వ్యాల్యూ పెరిగినంత మాత్రాన మీరు ఎక్స్‌ట్రాగా ఎలాంటి ప్రీమియం చెల్లించనక్కర్లేదు.
ఎందుకంటే కేవలం బోనస్ వల్లే మీ పాలసీ వ్యాల్యూ పెరుగుతుంది.బోనస్ ఎలా సంపాదించాలో తెలుసుకుంటే.
మీరు ఒక ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయలేదు అనుకోండి.అప్పుడు బీమా సంస్థలు మీకు బోనస్ అందిస్తాయి.
కొన్ని కంపెనీలు మీరు ఒక ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే 5 పర్సెంట్ బోనస్ అందిస్తాయి.ఒకవేళ మీ పాలసీ వ్యాల్యూ రూ.10 లక్షలు ఉంటే 5% పెరగడం వల్ల అది రూ.10 లక్షల 50 వేలకు చేరుకుంటుంది.అయితే ఇప్పుడు చాలా కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో 200 శాతం వరకు బోనస్ గా అందిస్తున్నాయి.ఈ బోనస్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు.
పాలసీదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో క్యుములేటివ్ బోనస్ అందుబాటులో ఉండకపోవచ్చు.అలాగే బోనస్ రేటు అనేది ఒక్కో బీమా సంస్థ ఒక్కోలా ఆఫర్ చేస్తుంది.
అయితే బోనస్ రూపేణా పెరిగే మీ పాలసీ వ్యాల్యూ కి తగినట్టుగా మీరు ఎక్కువ ప్రీమియం చెల్లించనక్కర్లేదు.ఫస్ట్ మీరెంత ప్రీమియం కట్టేలా ఒప్పుకున్నారో అంతే మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
ఈ విషయంలో మీరు బాగా లాభపడే అవకాశం ఉంది.







