ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి ప్రాజెక్టు పోలవరం పూర్తి చేయడానికి జగన్ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రాజెక్టులో కీలక ఘట్టం స్పీల్ వేలో 48 రేడియల్ గేట్లు అమరిక పనులు పూర్తి చేయడం జరిగింది.అదేవిధంగా 96 హైడ్రాలిక్ సిలిండర్లకు.84 సిలిండర్లను అమర్చడం జరిగింది.మిగిలిన ఆరు గంటలకు 12 సిలిండర్లు అమర్చడానికి ఏర్పాటు చేస్తూ ఉంది జగన్ ప్రభుత్వం.ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి పోలవరం డిజైన్ లకు ఆమోదం తెలపడానికి రెడీ అయింది.
ఈ నెల 25 తారీకు లోపు కొలిక్కి రావాలని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షేకావత్ ఆదేశాలు ఇచ్చారు.ఈ క్రమంలో డిజైన్ ల ఆమోదానికి ఈ నెల 28, 29 న మళ్లీ సమావేశం అవ్వడానికి రెడీ అవుతున్నారు.
ఈ సమావేశానికి సీడబ్ల్యూ సి, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు హాజరుకానున్నారు.ఈ పరిణామంతో దిగువ కాపర్ డ్యాం పనులకు మార్గం సుగమం కానుంది.
అదే సమయంలో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత్త వ్యయం కూడా కేంద్ర ప్రభుత్వం భరించడనికి రెడీ అయినట్టు సమాచారం.







