చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి రాష్ట్ర ఇంటెలిజెన్స్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావు కి కేంద్రం బిగ్ షాక్ ఇవ్వడం జరిగింది.నిఘా పరికరాల కొనుగోలు విషయంలో.
అవకతవకలు చేసినట్లు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వైసీపీఆయన పై ఆరోపణలు చేయటం తెలిసిందే.ఎటువంటి నిబంధనలు పాటించకుండా నిఘా పరికరాలను రూ 25.5 కోట్లను వెచ్చించడం జరిగింది.దీంతో ఏబీ వెంకటేశ్వరరావు పై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడం తెలిసిందే.
ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ నీ సవాలు చేస్తూ కేంద్రప్రభుత్వానికి ఏబీ అప్పీల్ చేసుకోవడం జరిగింది.అయితే ఈ అప్పీల్ నీ తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ నీ కేంద్ర హోంశాఖ ఖరారు చేస్తూ సమర్ధించడం జరిగింది.అంతేకాకుండా ఏబీ వెంకటేశ్వరరావుపై ఛార్జిషీట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ పరిణామంతో ఏబీ వెంకటేశ్వరరావు మరింత చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.







