మారుతీ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.ప్రెసెంట్ మారుతీ గోపీచంద్ హీరోగా యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించే ‘పక్కా కమర్షియల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా షూటింగ్ ను చకచకా పూర్తి చేస్తున్నాడు మారుతి.
ఈ సినిమా అయిన వెంటనే చిరంజీవితో తన సినిమా ఉండబోతుందని మారుతి ప్రకటించిన విషయం తెలిసిందే.
చిరు చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తి అయినా తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.ఈ గ్యాప్ లో మారుతీ ఏకంగా డార్లింగ్ ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేసాడు.
ఎవ్వరు ఊహించని కాంబో ప్రకటించడంతో అందరు ముందు షాక్ అయ్యారు.

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.ఈయన సినిమాలు అన్ని కూడా 100 కోట్ల బడ్జెట్ పైమాటే అని చెప్పాలి.ప్రభాస్ చేతిలో ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఉన్నాయి.
ఇవి పూర్తి అయ్యే వరకు మరొక సినిమా ఉండదు అని అంతా అనుకున్నారు.కానీ ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అని తెలిసి అందరు ఆశ్చర్య పోయారు.
మారుతి, ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాని మారుతి ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.
ఈ సినిమా ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉంటుందట.హారర్ అండ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వచ్చింది.
ఈ సినిమా టాక్ బయటకు వచ్చినప్పటి నుండే ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ అనుకున్నారు.కానీ ఈ సినిమాకు ఈ టైటిల్ కాదని తెలుస్తుంది.

ఆ టైటిల్ తో మారుతి మాస్ మహారాజ రవితేజా తో ఒక సినిమా చేస్తున్నాడని ఆయన సినిమాకే రాజా డీలక్స్ అనే పేరు పెట్టారని తెలుస్తుంది.ప్రభాస్ సినిమాకు వేరే టైటిల్ ను వెతికే పనిలో మారుతి అండ్ టీమ్ ఉన్నారట.మరి ఇప్పటి వరకు ప్రభాస్, మారుతి సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ అనుకున్నారు.ఇప్పుడు కాదు అని తెలియడంతో కొత్త టైటిల్ కోసం ఎదురు చూస్తున్నారు.







