తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
అంతేకాకుండా కమెడియన్ గా పీక్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని రెండు మూడు సినిమాలతో సరిపెట్టుకున్నాడు.ఆ తర్వాత కూడా సినిమాలలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనదైన టైమింగ్ తో ప్రేక్షకులని నవ్విస్తూ వస్తున్నాడు.
అయితే ఒక వైపు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉండి సునీల్ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు పెద్దఎత్తున వినిపించాయి.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరి ఆయన నియోజకవర్గం భీమవరం నుండి పోటీ చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా ఆ విషయాలపై స్పందిస్తూ.తనకు రాజకీయాలు సూట్ కావని, పవన్ కళ్యాణ్ గారు అడిగినా అదే చెప్పాను అంటూ ట్విస్ట్ ఇచ్చారు సునీల్.
అదే విధంగా తాను జనసేన పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.నాకు రాజకీయాలతో అంతగా టచ్ లేదు.
రాజకీయాలంటే ఏమిటో కూడా నాకు తెలియవు అని తెలిపారు సునీల్.అసలు నేను పాలిటిక్స్ కి క్వాలిఫైడ్ కాదు అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు సునీల్.
అలాగే పవన్ కళ్యాణ్ కి తన అంటే ఎంతో ఇష్టమని, పవన్ కు సునీల్ ను జనసేనలోకి ఆహ్వానించాలని ఉంది కానీ సునీల్ కు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదని తెలిపారు.

మనం జనాభాకి న్యాయం చేయలేనప్పుడు పాలిటిక్స్ కి సూట్ కాము, ఫండ్స్ తక్కువ ఉన్నప్పుడు అందరినీ సంతృప్తి పరచలేని.ఎంతో మంది ఎన్నో రకాలుగా మాటలు మాట్లాడుతారు మనం ఎందుకు అనిపించుకోవాలి అందుకే నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు అని అసలు విషయం బయట పెట్టాడు సునీల్.పవన్ కళ్యాణ్ విషయం కొస్తే.
పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమే కానీ పవన్ కు తన వంతు సహాయం అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని సునీల్ తెలిపారు.కానీ సహాయం రాజకీయంగా మాత్రం కాదు.
ఎందుకంటే రాజకీయల గురించి తనకు తెలియదని.ఆ విషయంలో తాను ఎటువంటి హెల్ప్ చేయలేను అంటూ పొలిటికల్ ఎంట్రీపై స్పందించాడు సునీల్.







