నేడు దేశ వ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో పలువురు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేతగా, టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ దేశ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయులకు ముఖ్యంగా హిందువులకు ప్రకృతి ప్రసాదించిన అందమైన పండుగ హోలీ అంటూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
వసంత ఋతువులో వచ్చే ఈ పండుగ వసంతోత్సవ వేడుక జరుపుకునే వేల దేశ ప్రజలందరికీ నా తరఫున జనసేన తరపున అందరికీ హోలీ శుభాకాంక్షలు.
మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఒక్కో విధంగా పిలుచుకొని ఈ పండుగ భారతీయ ఐక్యతకు ప్రతీకగా నిలబడుతుందంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

దేశవ్యాప్తంగా నేడు హోలీ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఒకరికొకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే భీమ్లా నాయక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉన్నారు.ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో పాల్గొనబోతున్నారు.







