ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యులకు పెద్దపీట వేస్తూ పాలన చేస్తున్న సంగతి తెలిసిందే.ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ రీతిగానే ఎక్కువగా ఆలోచనలు కార్యక్రమాలు ఢిల్లీలో చేస్తూ ఉంటారు.
కాగా ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం.కాంగ్రెస్, బీజేపీ పార్టీలను చిత్తూ చిత్తుగా ఓడించడం తెలిసిందే.
కాగా ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయడం మనం చూశాం.

అయితే సీఎం పదవి చేపట్టిన వెంటనే ఇప్పుడు సరికొత్త నిర్ణయం భగవంత్ మాన్ నిర్ణయం తీసుకున్నారు.విషయంలోకి వెళితే పంజాబ్ రాష్ట్రంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా సులువుగా. ప్రభుత్వ దృష్టికి అవినీతి ఫిర్యాదులు తీసుకురావడానికి భగవంత్ మాన్ కొత్తగా ఆలోచించారు.
వాట్సాప్ ద్వారా అవినీతి పై ఫిర్యాదు చేసే సరికొత్త విధానాన్ని తీసుకురావటం జరిగింది.ఈనెల 23 అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.







