మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆర్ఆర్‌ఆర్ సినిమా ఈ నెల 25వ తారీకు న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించబోతుండగా.రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు.
వీరిద్దరిని ఆ అద్వితీయమైన పాత్రల్లో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి చూపించేందుకు రంగం సిద్ధమైంది.ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసిన ఎన్నో పాత్రల కంటే అల్లూరి సీతారామరాజు ది బెస్ట్ అన్నట్లుగా ఉండబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.తన ప్రతి సినిమాకు కూడా విభిన్నంగా ఉండాలి అనే ఉద్దేశంతో రామ్ చరణ్ కొత్త కొత్త పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఉంటాడు.తాజాగా ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు గా కనిపించిన రామ్ చరణ్ తదుపరి సినిమా శంకర్ దర్శకత్వంలో చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు.
అంటే ఆర్ ఆర్ ఆర్ లో పాత్ర కంటే శంకర్ సినిమాలో పాత్ర మరింత మెరుగ్గా ఉంటాడు అనేది టాక్.అలా తన స్టార్ డమ్ ను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇదే సమయంలో జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో కూడా రామ్ చరణ్ చాలా విభిన్నమైన పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.మొత్తానికి ఒక సినిమా ను మించి ఒక సినిమాలో ఉండాలనే ఉద్దేశంతో చరణ్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.
ఆయన ప్రతి పాత్రని కూడా మెగా స్టార్ చిరంజీవి తనయుడు అని కాకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు చేస్తున్నాడు అంటూ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇది ఖచ్చితంగా అభినందనీయం.
బ్యాక్ టు బ్యాక్ విభిన్నమైన పాత్రలతో రాబోతున్న చరణ్ కు ఎలాంటి సక్సెస్ లు దక్కుతాయి అనేది చూడాలి.







