టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మార్చి 25వ తారీకున భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది.
జక్కన్న ఈ సినిమా తర్వాత తదుపరి చేయబోతున్న సినిమా ఎవరితో అంటే చిన్న పిల్లాడి నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు చెప్పే సమాధానం మహేష్ బాబు తో ఆయన సినిమా చేయబోతున్నాడు.ఆయన తప్పకుండా మహేష్ బాబుకు ఒక భారీ సినిమా ను ఇస్తాడు అంటున్నారు.
ఈ సమయంలో అనూహ్యంగా అల్లు అర్జున్ పేరు వినిపించడంతో మహేష్ బాబు అభిమానులు అవాక్కవుతున్నారు.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని పెంచేసుకుని మరీ వెయిట్ చేస్తున్నారు.
ఈ సమయంలో అల్లు అర్జున్ పేరు ప్రస్థావనకు వచ్చిన వెంటనే అంతా కూడా ఆలోచన ల్లో పడ్డారు.అసలు మహేష్ బాబు మరియు రాజమౌళి సినిమా ఉందా అంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యింది.
రాజమౌళి దర్శకత్వంలో సినిమా ను అల్లు అర్జున్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

అల్లు అర్జున్ తో సినిమా ను రాజమౌళి పట్టాలెక్కిస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి.కాని అది ఎప్పుడు.ఎలా అనేది క్లారిటీ లేదు.
అసలు విషయం ఏంటీ అంటే అల్లు అరవింద్ ఎప్పుడో రాజమౌళికి అల్లు అర్జున్ తో సినిమా తీయాలని అడ్వాన్స్ ఇచ్చాడట.కనుక వీరిద్దరి కాంబోలో కూడా సినిమా ఉంటుందని అంటున్నారు.
అది ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.మహేష్ బాబు తో సినిమా ను రాజమౌళి చేయబోతున్నాడు.
ఆ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవ్వబోతుంది. కనుక 2025 సంవత్సరం లో బన్నీ తో జక్కన్న మూవీ ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.







